అలనాటి ముద్దుగుమ్మ సౌందర్య గురించి తెలియని వారు ఉండరు. తన అందం, నటన, అమాయకత్వంతో ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అతి చిన్న వయసులోనే అత్యధిక సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అగ్ర హీరోలు అందరి సరసన నటించి జూనియర్ సావిత్రి గా చలనచిత్ర పరిశ్రమలో పేరు సంపాదించుకున్నారు. 12 ఏళ్ల సినీ ప్రయాణంలో 120 కి పైగా చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అనేక భాషా చిత్రాల్లో నటించారు.
Advertisement
చాలా ఆనందంగా సాగుతున్న సౌందర్య జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఏప్రిల్ 17, 2004 సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. తన మరణవార్త విన్న సినీ ప్రేమికులు కోలుకోలేకపోయారు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 2012 ఎన్నికల సమయంలో అధికార పార్టీలు సినిమా స్టార్స్ తో ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే కరీంనగర్ ఎంపీ సిహెచ్ విద్యాసాగర్ రావు పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా సౌందర్య ప్రచారం చేయాలని అధిష్టానం వారు నిర్ణయించారు. ఇక సౌందర్య కరీంనగర్ వెళ్లడానికి రెడీ అయ్యారు. సౌందర్యతో పాటు తన అన్న కూడా వెళ్లారు.
Advertisement
వీరిని ఎయిర్పోర్టులో డ్రాప్ చేయడానికి తన వదిన, మేనకోడలు కూడా వచ్చారు. హెలికాప్టర్ ఎక్కే ముందు సౌందర్య అందరితో ‘వెళ్ళొస్తా’ అని టాటా చెప్పి హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ స్టార్ట్ అయ్యి రన్వే పైనుంచి వెళ్ళిన మూడు నిమిషాలకే 50 అడుగుల ఎత్తుకి ఎగిరి ముందుకు వెళ్లి కుప్పకూలింది. వారిని కాపాడాలని విమానయాన సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. అందులో ఉన్న వారందరూ అగ్నికి ఆహుతి అయ్యారు. ఇక అదే రోజు సాయంత్రం బెంగుళూరులో రాజాజీ ఘాట్ లో అంత్యక్రియలు జరిపించారు. చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆమె అంత్యక్రియలకు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!
రైల్వే స్టేషన్ మాస్టర్ జీతం, లభించే సదుపాయాల గురించి తెలుసా?
రోహిత్ శర్మను బండబూతులు తిట్టిన శ్రీ రెడ్డి.. కోహ్లీ ముందు నువ్వు పిల్ల బచ్చావ్ !