ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి తో చాలామంది జీవితాలు చీకటి మయమయ్యాయి. కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే మరికొందరు కొడుకులను ఇంకొందరు కోడళ్ళు ,మనవలు, మనవరాళ్ళు ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. మన అనుకున్నవాళ్లను కూడా దూరం పెట్టే రోజులను చూపింది కరోనా. సాధారణంగా అత్తమామల అంటే కోడళ్లను రాకి రంపాన పెడతారు. కానీ ఇక్కడ తమ కొడుకు మృతి చెందిన చేదు వార్తలు కూడా దిగమింగి తన కోడలికి వారు తల్లిదండ్రులు గా మారిపోయి రెండో పెళ్లి చేయడం విశేషం. అంతేకాదు తమ ఆస్తిని కూడా కోడలుకు రాసిచ్చారు.
Advertisement
మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. థార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి యగ్ ప్రకాశ్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి. 2021 ఏప్రిల్ 25న కరోనా బారినపడి మరణించారు. భూపాల్ నెట్‌లింక్ కంపెనీలో సీనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీరింగ్ గా పనిచేశారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటు. అతనికి 2011 నవంబర్ 27వ తేదీన వివాహం అయింది. అయితే ప్రస్తుతము వారికి అన్య తివారి అనే 9 ఏళ్ల బాలిక ఉన్నది. ప్రియాంక మృతితో అతని భార్య వితంతుగా మారిపోయింది. కోడలు 9 ఏళ్ల మనవరాలు భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబం పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
కోడలు జీవితంలో ఇంతటితో ఆగిపోతుందని.. ఆమె అత్త, మామ ఆమెను తన కూతురుగా భావించి మరొక వ్యక్తితో పెళ్లి చేశారు. కోడలుకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. వితంతువైన కోడలు రీఛా తివారిని అక్షయ తృతీయ నాడే నాగపూర్ నివాసి వరుణ్ మిశ్రాకు ఇచ్చి పెళ్లి జరిపించారు. సొంత ఖర్చుతో కోడలికి పెళ్లి చేయడం విశేషం. తమ కుమారుడు కొనుగోలు చేసిన ఇంటిని కూడా కోడలుకు రాసిచ్చారు. తన భర్త చనిపోయిన తర్వాత ఆయన భర్త చేసిన కంపెనీలో భార్య ఉద్యోగం వచ్చింది. ప్రస్తుత ఓ ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ సాయి. ఆమె తల్లిదండ్రుల గురించి అత్తమామల పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read :
సమంత మాదిరిగానే నయనతార కూడా విడాకులతో విడిపోతుందట.. అందుకోసమేనా..?
తిరుమలలో మనకి నిత్యం వినిపించే ‘ఓం నమో వేంకటేశాయ’ ఆ గొంతు ఎవరిదో తెలుసా..?