Home » స‌మంత మాదిరిగానే న‌య‌న‌తార కూడా విడాకుల‌తో విడిపోతుంద‌ట‌.. అందుకోస‌మేనా..?

స‌మంత మాదిరిగానే న‌య‌న‌తార కూడా విడాకుల‌తో విడిపోతుంద‌ట‌.. అందుకోస‌మేనా..?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోల‌లో ఒక‌రైన నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్ స‌మంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట మూడున్న‌ర ఏళ్ల పాటు స‌జావుగానే సాగింది వీరి జీవితం. వీరు ఫ్యామిలీ లైఫ్‌ను బాగానే ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా రెండు ఘ‌ట‌న‌ల వ‌ల్ల‌నే వీరి మ‌ధ్య పంతాలు, ప‌ట్టింపులు రావ‌డంతో అక‌స్మాత్తుగా విడాకుల నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త ఏడాది విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఆ త‌రువాత ఎవ‌రి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్ద‌రూ వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.


ప్ర‌స్తుతం మ‌రొక సౌత్ ఇండియా స్టార్ న‌య‌న‌తార ప‌రిస్థితి స‌మంత జీవితంలాగానే కాబోతుందా..? అంటే వీరు కూడా త‌మ పెళ్లి జీవితం కొన‌సాగించ‌లేక గొడ‌వ‌ల‌తో విడిపోతార‌ని జ్యోతిష్య‌శాస్త్రం చెప్ప‌డం విశేషం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌ముఖ జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు వేణుస్వామి వెల్ల‌డించారు. స‌మంత‌-నాగ‌చైత‌న్య పెళ్లికి ముందు కూడా వీరిద్ద‌రూ ఎక్కువ కాలం క‌లిసుండ‌రు చెప్పడం గ‌మ‌నార్హం. అదేవిధంగా ప్ర‌భాస్ పెళ్లి, రాధేశ్యామ్ సినిమా ఇలా ప్ర‌తి దాని గురించి వేణుస్వామి చెప్పిన‌వ‌న్ని నిజమ‌య్యాయి. ఇక వేణు స్వామి చెప్పిన‌వి నిజం అవుతాయ‌ని న‌మ్మేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

Advertisement

Advertisement


న‌య‌న‌తార‌-విఘ్నేష్‌ల విష‌యానికొస్తే.. న‌య‌న‌తార విఘ్నేష్‌కంటే ఏడాది పెద్ద‌. వీరు కూడా గ‌త నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నా పెళ్లి అన్న‌మాట ఎత్త‌డం లేదు. పైగా గుళ్లు, గోపురాల చుట్టూ విప‌రీతంగా తిరుగుతున్నారు. జూన్ 09న వీరి పెళ్లి జ‌రుగ‌బోతుంద‌నే విష‌యం తెలిసిన‌దే. అయితే ఇటీవ‌లే వీరి పెళ్లి, దాంప‌త్య జీవితం గురించి వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌య‌న‌తార‌కు పెళ్లి క‌లిసి రాద‌ని.. ఆమెకు గురుడు నీచ స్థితిలో ఉండ‌డంతో వైవాహిక జీవితంలో వెంట‌నే క‌ల‌త‌లు వ‌చ్చి.. గొడ‌వ‌లు జ‌ర‌గ‌డంతో పాటు భ‌ర్త నుండి విడిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పుకొచ్చాడు. కొంద‌రూ వేణుస్వామిని త‌ప్పు ప‌డుతున్నారు. ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటుంటే.. అప‌శ‌కునం మాట‌లు ఏమిటి బాబు అని విరుచుకుప‌డుతున్నారు. ముగ్గురు హీరోల‌తో ప్రేమ‌లో మునిగితేలి విడిపోయిన న‌య‌న్‌.. త‌న‌కంటే చిన్నోడైన ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది. చైతు-సామ్ విష‌యంలో వేణుస్వామి చెప్పింది నిజ‌మ‌వ్వ‌డంతో ఇది కూడా రిపీట్ అవ్వొచ్చ‌ని కొంద‌రూ వేణుస్వామికి మ‌ద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : 

సర్కారువారిపాటలో భారీ మిస్టేక్…ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ…!

ఎండాకాలంలో రాగి పాత్ర‌ల‌ను వాడుతున్నారా..? అయితే మీకు ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్టే లెక్క‌..!

 

Visitors Are Also Reading