Home » శోభన్ బాబు ఇప్పుడే పుట్టి ఉంటె ఇలానే ఉండేవాడేమో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

శోభన్ బాబు ఇప్పుడే పుట్టి ఉంటె ఇలానే ఉండేవాడేమో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

by Srilakshmi Bharathi
Ad

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నిన్నటి తరం అందగాడు ఎవరు అన్న పేరు వస్తే.. లిస్ట్ లో మొట్ట మొదటగా శోభన్ బాబు గారే ఉంటారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా ప్రేక్షకులు ఆయనను అంత త్వరగా మర్చిపోలేరు. తెలుగు హీరోలు అంటే ఇలానే ఉంటారు.. అన్న ముద్రని పటాపంచలు చేసి సరికొత్త హీరోగా ప్రపంచానికి పరిచయం చేసుకున్న ఘనత ఆయనది. ఆయన అందం ముందు హాలీవుడ్ హీరోలు కూడా దిగదుడుపే అని అప్పట్లోనే చెప్పుకునే వారు.

Advertisement

త్వరలోనే ఆయన పుట్టిన రోజు రాబోతుంది. అందు సందర్భంగా ఆయన అభిమానులకు ఓ మర్చిపోలేని బహుమానం అందింది. అదేంటో కాదు.. శోభన్ బాబు గారి ఏఐ వైరల్ వీడియో. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంత ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ శోభన్ బాబు అభిమానులకు ఓ మంచి పని చేసి పెట్టింది. అదేంటంటే.. ఆయన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ వీడియోను రూపొందించింది.

Advertisement

ఆయన ఓ అందమైన హీరో. అయితే ఇది నిన్నటి తరం వాళ్లకి మాత్రమే తెలుసు. ఇప్పుడు రూపంలో ఆయన రెడీ అయితే.. ఎలా ఉంటారో ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ వీడియోలో చూపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సముద్రం ఒడ్డున శోభన్ బాబు నడిచి వస్తున్నట్లుగా ఈ వీడియో ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఈ వీడియో ను తన X ఖాతాలో పంచుకున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading