నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ కమర్షియల్ మూవీ వీర సింహారెడ్డి. ఈరోజు థియేటర్ లోకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ లో, ప్రీమియర్ షోలు కూడా వచ్చాయి. తెల్లవారుజామునుంచే థియేటర్లలో జాతర మొదలైందని చెప్పవచ్చు. బాలకృష్ణ అభిమానులు థియేటర్ల వద్ద టపాసుల మోత మోగిస్తున్నారు. దీంతో అమెరికా తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసినవారు ట్విట్టర్ ద్వారా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి విరసింహారెడ్డి మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది..
Advertisement
సినిమాలో కొత్తదనం ఏమీ లేదని అంటున్నారు. సినిమా మొదలైన 15 నిమిషాల వరకు అనవసరమని, ఆ తర్వాత నుంచి అసలు మూవీ మొదలవుతుందని కొందరు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. పాటలు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు కాస్త పట్టునందిస్తున్నాయి. కానీ ఇందులో కొన్ని యాక్షన్ సీన్స్ మరి ఓవర్ గా ఉన్నాయని, వీటిని చూస్తే విసుకు కూడా వస్తుందంటూ తెలియజేస్తున్నారు. కొంతమంది సినిమా ఫస్ట్ అఫ్ చాలా బాగుందని , సెకండ్ హాఫ్ చాలా సాగదీతగా ఉందని వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇంకొందరు సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు.
Advertisement
కథ పాతదే అయిన కొత్తగా తెరకెక్కించాలని, కానీ గోపీచంద్ మాత్రం అలా చేయలేదని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ లేదని, కొంతమంది మాత్రం రొటీన్ స్టోరీని డైరెక్టర్ గోపీచంద్ బాగా చూపించారని అంటున్నారు. ఇక సినిమాలో విలన్ గా నటించిన దునియా విజయ్ గురించి ఏ ఒక్కరు మాట్లాడటం లేదని, వరలక్ష్మి శరత్ కుమార్ నటన చాలా బాగుందని ట్వీట్ చేస్తున్నారట. మొత్తానికి వీరసింహారెడ్డి చిత్రంలో కొన్ని మైనస్ లు మినహా బాగానే ఉందని అంటున్నారు ప్రేక్షకులు. మరి చూడాలి ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో..
also read;