Home » పెరుగుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. చుండ్రుకు కూడా చెక్ పెట్టొచ్చా..!!

పెరుగుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. చుండ్రుకు కూడా చెక్ పెట్టొచ్చా..!!

by Sravanthi
Ad

పెరుగు మన జీర్ణక్రియ సమస్యలనే కాకుండా అనేక సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా పెరుగు మన వెంట్రుకలకు మరియు చర్మానికి ఎంతో ఉపయోగకారి.. పెరుగులో విటమిన్ బి, విటమిన్ బీ 2, పొటాషియం, ఇలాంటి ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. పెరుగు అనేది ప్రోబయోటిక్స్ ఆహారం. ఇది జీర్ణక్రియ సమస్యలనే కాకుండా ప్రేగులలో వచ్చే సమస్యలు కూడా చక్కగా పరిష్కరిస్తుంది.

Advertisement

పెరుగులో ఉండే సజీవ బ్యాక్టీరియం వ్యాధికారక క్రిములతో పోరాడటమే కాకుండా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. చర్మంపై పెరుగు రాసుకుంటే మాయిశ్చరైజింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది. రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగు తినడం వల్ల వెంట్రుకలు బలంగా తయారై చుండ్రు లాంటి సమస్యలు ఉండకుండా చేస్తుంది.

Advertisement

విటమిన్ డి కాకుండా ఖనిజ లవణాలు కూడా పెరుగులో ఉండటం వల్ల మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. మనము ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో అవిసె గింజలు, తాజా పండ్లు, ప్రొద్దుతిరుగుడు గింజలు వేసి కలుపుకొని తింటే మన శరీరానికి మరింత ఫైబర్ పోషకాలు అందుతాయి. అందుకే రోజువారీ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాల్సిందే అని వైద్యులు సూచిస్తారు.

also read;

చెన్నై గెలుస్తున్నా.. ఏడుస్తున్న అభిమానులు…!

మేక‌ప్ తీయాల్సిందే.. తీయ‌డం కుద‌ర‌దు.. అయితే నేను ప‌ని చేయ‌ను..!

 

Visitors Are Also Reading