కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మణిపూర్ పర్యటనలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో స్మృతి ఇరానీ మణిపూర్ కు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె వాంగ్ కీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో అక్కడి మహిళ కళాకారులు తమ సాంప్రదాయ నృత్య ప్రదర్శన చేశారు.
Advertisement
సాంప్రదాయ దుస్తులను ధరించి నృత్యాలు చేశారు. ఇక ఈ నృత్య ప్రదర్శనలో స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు. ఆమె కూడా కళాకారులతో కలిసి కాలు కదిపారు. అంతే కాకుండా స్మృతి ఇరానీ కూడా కళాకారుల మాదిరి సాంప్రదాయ దుస్తులను ధరించి స్టెప్పులు వేశారు. దాంతో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆమెను ప్రోత్సహించారు. చప్పట్లు కొడుతూ ఉత్సాహాన్ని మరింత పెంచారు.
Advertisement
ప్రస్తుతం స్మృతి ఇరానీ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28 మరియు మార్చి 5 రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. అంతే కాకుండా మార్చి 10న ఫలితాలు వెలుబడనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది.
#WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW
— ANI (@ANI) February 18, 2022