Home » Smitha Shabarwal: ఇండియా టాపర్, గోల్డ్ మెడలిస్ట్.. కానీ స్మితా సబర్వాల్ గారు అందులో ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యారా..?

Smitha Shabarwal: ఇండియా టాపర్, గోల్డ్ మెడలిస్ట్.. కానీ స్మితా సబర్వాల్ గారు అందులో ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యారా..?

by Sravya
Ad

స్మిత సబర్వాల్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఆమె అందరికీ పరిచయమే. స్మిత సబర్వాల్ ఇంటర్ లో ఐసిఎస్ఈ సిలబస్ లో టాపర్ గా నిలిచారు. నిజానికి ఇది ఎంత కష్టమో మనకి తెలుసు కానీ ఆమె మాత్రం ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారు.

smita-sabarwal-family-photos

Advertisement

స్మిత 1999లో సివిల్స్ ఎగ్జామ్ రాశారు కానీ ప్రిలిమ్స్ లోకి క్వాలిఫై అవ్వలేకపోయారు అప్పుడు కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకున్నారు. 2001లో రెండవసారి మళ్లీ సివిల్స్ పరీక్ష రాశారు స్మిత. ఈసారి ఆమె పాస్ అవ్వడమే కాకుండా మొత్తం ఇండియాలో నాలుగవ ర్యాంక్ ని సాధించారు. స్మిత చాలా టాలెంటెడ్ ఎప్పుడూ చదువులో ముందు ఉండేవారు.

 ఆమె చిన్నప్పటినుండి కూడా చదువులో చురుకుగా ఉండేవారు అన్నిట్లో కూడా ఆమె ఫస్ట్ వచ్చేవారు. అయితే అన్నిట్లో ఫస్ట్ ఉన్న స్మిత ఐదో తరగతిలో స్థానిక భాషలో మాత్రం ఫెయిల్ అయ్యేవారు. చాలాసార్లు ఆమె ఐదవ తరగతి లో ఉన్నప్పుడు స్థానిక భాషలో ఫెయిల్ అవుతూ ఉండేవారట. ఇది ఇలా ఉంటే 2001లో ట్రైనీ కలెక్టర్ గా ఐఏఎస్ విధుల్లో చేరారు స్మిత. మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు స్మిత. తన గ్రాడ్యుయేషన్ ని హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేశారు. ఈమె ఎస్ఎస్ వాలంటీర్ బిజినెస్ లా ఎకౌంటెన్సీ మార్కెటింగ్ లో డిగ్రీ పొందారు.

Advertisement

2001 ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కి చెందిన స్మిత, 2001లో అదిలాబాద్ లో ట్రైన్ కలెక్టర్గా నియమితులయ్యారు. తర్వాత 2003 జూలై 14 నుండి 2004 నవంబర్ 27 వరకు చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్గా పని చేశారు. 2004 నవంబర్ 28 నుండి 2004 డిసెంబర్ 31 వరకు గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్గా ఈమె పనులు చేశారు. 2005 నుండి 2006 మే 15 వరకు కడపలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. 2007లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా, 2007 మే 29 నుండి 2009 అక్టోబర్ 22 వరకు విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. స్మిత 2010లో కరీంనగర్ కలెక్టర్గా తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading