Home » పాములు ఇళ్ల‌లోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

పాములు ఇళ్ల‌లోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

by Anji
Ad

సాధార‌ణంగా కొంత మంది హిందువులు పాముల‌ను దేవ‌త‌లుగా కొలుస్తుంటారు. ఓ వైపు కొలుస్తూనే.. మరోవైపు పాము కనిపిస్తే భయపడి పారిపోతుంటాం. దానిని చూడ‌గానే భ‌యం వేస్తుంటుంది. భూమి మీద మానవాళి తో పాటు జీవించే అతి ప్రమాదకరమైన జీవి పాము. పాముకు ఉండే రెప్పపాటు వేగం, విషమే మనిషి భయానికి కారణం. అందుకే పామును చూస్తే చాలు భయంతో పారిపోతుంటారు. అయితే పాములు ఇళ్లల్లోకి చొరబడేందుకు ఈ ఆరు ముఖ్య కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Also Read : కంటి చూపు త‌గ్గుతున్న‌ట్టు అనిపిస్తోందా ? మీ డైట్‌లో ఇది త‌ప్ప‌క చేర్చుకోండి..!

Advertisement

ఏ ఇతర జంతువులలో లేనిది పాముల్లో మాత్రమే కనిపించేది చర్మాన్ని విడిచే ప్రక్రియ. పాములు సీజన్ ప్రకారం పాత చర్మాన్ని వదిలేస్తుంటాయి. పాములు పాత చర్మాన్ని విడిచేటప్పుడు సపోర్ట్ కోసం రాళ్లు, కాంక్రీటు, కలప వంటివి అవసరమ‌వుతాయి. వాటిని ఆసరా కోసం వెతుక్కుంటూ ఇళ్లవైపుకు వస్తాయి. మ‌రోవైపు వాటికి ఆహారం లభించక పోవడం కూడా ప్రధాన కారణం. పర్యావరణ చట్టంలో పాములు కూడా భాగమే. పంట పొలాల్లో తెగుళ్లను తినేది పాములే. సరీశృపాల ఆహారం కోసం కూడా ఇళ్లవైపుకు వస్తుంటాయి.ఇళ్లలో ఉండే ఎలుకలు, బయట ఉండే కప్పలు, బల్లులు, పక్షుల కోసం వస్తుంటాయి.

Advertisement

Also Read :  మీ చెవిలో ఏదైనా ప‌డిందా..? అయితే ఇలా చేస్తే ఫ‌లితం ప‌క్కా ..!

పాములు కోల్డ్ బ్లడెడ్ జీవులు కావడంతో వెచ్చదనం కోసం చూస్తుంటాయి. శరీర ఉష్ణోగ్రతను తట్టుకోలేక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి ఎలాగైనా చొరబడగలవు. తలుపులు, కిటికీలు, గోడల బీటలు, చిన్నచిన్న రంధ్రాల నుంచి పాములు చొచ్చుకొచ్చేస్తాయి.పాములు చిన్న సందు దొరికిన స‌రే దూరి పోతుంటాయి. ఇంటి ప్రదేశాల్ని ఎవరు గుర్తించలేరు అన్నట్టుగా భావించి ఇళ్లలో మూలల్లో చేరుపోతుంటాయి. సీజన్ మారినప్పుడు పాములు నిద్రాణ స్థితిలో చేరుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కాస్త నిర్మాణుష్యంగా, పొదలు, చెట్లు, ఉండే ప్రదేశాల్లో, ఇరుకుగా ఉండే గుడిసెల్లో పాములు ఎక్కువగా చేరే అవకాశం ఎక్కువగా ఉంది కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండ‌డం బెట‌ర్‌.

Also Read : చలికాలంలో పిల్లలకు ఇలాంటి ఆహారాలు ఇవ్వటం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు..!

 

Visitors Are Also Reading