మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఖడ్గం సినిమా గురించి తెలియని వారు ఉండరు. 1990 ఆ కాలంలో పుట్టిన వారికి ఖడ్గం సినిమా గురించి చాలా బాగా తెలుసు. పంద్రాగస్టు లేక జనవరి 26వ తేది వస్తే చాలు ప్రతి ఇంట్లో ఖడ్గం సినిమా నడుస్తూ ఉంటుంది. 2002 సంవత్సరంలో ఖడ్గం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడుగా పనిచేయగా ఉత్తేజ్ డైలాగ్స్ రాశారు.
ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోగా శ్రీకాంత్ నటించగా, సైడ్ హీరోలుగా రవితేజ మరియు ప్రకాష్ రాజ్ నటించి.. అందరిని మెప్పించారు. అటు ఈ సినిమాలో సోనాలి బింద్రే సంగీత మరియు కిమ్ శర్మ హీరోయిన్లుగా నటించారు. స్వాతంత్ర దినోత్సవం గురించి అలాగే పాకిస్తాన్ ఆగడాల గురించి ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు దర్శకులు కృష్ణవంశీ. ముఖ్యంగా ముస్లింలను ఉద్దేశించి తీసినట్లే ఈ సినిమా ఉంటుంది.
Advertisement
Advertisement
అయితే తాజాగా ఖడ్గం సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖడ్గం సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడు కృష్ణవంశీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాడట. ఈ విషయాన్ని స్వయంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి వెల్లడించారు. ఖడ్గం సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణవంశీ వారం రోజులపాటు దాక్కున్నారని సిరివెన్నెల సీతారామరాజు శాస్త్రి వెల్లడించారు. ఓ మతానికి చెందిన వారు కృష్ణవంశీని చంపుతారేమోనని భయపడి… ఆయన దాక్కున్నారని వెల్లడించారు. కానీ ఆ సమయంలో ఏం హిందూ మతస్తులు.. పోలీసులు కృష్ణవంశీకి అండగా నిలువలేదని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
Samantha : అమెరికాలో కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్ సమంత ?
దివ్యభారతి చనిపోయి ఇంత మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందా…?
World Cup 2023 : హైదరాబాద్ లో పాకిస్తాన్ మ్యాచ్ డేంజర్ అంటున్న పోలీసులు..!