సిరి శ్రీహాన్ జంట అంటే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇద్దరూ షార్ట్ ఫిల్స్మ్ తో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. అలా వచ్చిన పాపులారిటీతోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట సిరి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టగా ఆ తరవాత సీజన్ లోనే సిరి బాయ్ ఫ్రెండ్ గా శ్రీహాన్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇక ఇద్దరూ కూడా తమ టాలెంట్ తో బిగ్ బాస్ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.
Advertisement
ఇక వీరిద్దరూ లవర్స్ అని బిగ్ బాస్ తరవాతనే చాలా మందికి తెలుసు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ కలిసి వీడియోలు చేస్తూ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాక్యలు చేసింది.
Advertisement
తాము కలిసి చాలా వెబ్ సిరీస్ లు చేశామని దాంతో బోర్ కొడుతుందని కొత్తవారితో చేయాలని అనుకున్నామని అందుకే గ్యాప్ తీసుకున్నామని అన్నారు. కానీ అభిమానులు ఇద్దరూ కలిసి చేయండి అంటూ మోసేజ్ లు పెడుతున్నారని దాంతో ప్రస్తుతం మళ్లీ కలిసి ఓ సిరీస్ చేస్తున్నామని చెప్పారు.
అంతే కాకుండా తాము తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నామని సిరి వెల్లడించింది. ఇక పెళ్లి గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నించగా….పెళ్లి రేపు అంటే రేపు జరిగిపోతుందని కాకపోతే వచ్చే ఏడాది చేసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించింది. శ్రీహాన్ నన్ను క్షమిస్తాడు. గుండెల్లో పెట్టుకుంటాడు. ఇక ఎన్నిసార్లు ఐలవ్యూ చెప్పాడో లెక్కపెట్టలేం అంటూ సిరి తన లవ్ స్టోరిని చెప్పుకొచ్చింది.
ALSO READ :సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో… అది చూసిన భార్య ఏం చేసిందంటే?