ఈ మధ్యకాలంలో సీరియల్లలో నటించే నటీనటులకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం చాలా టెలివిజన్ ఛానల్లో చాలా టీవీ సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. కాకపోతే అందులో కొద్ది మందికి మాత్రమే అద్భుతమైన ప్రేక్షాదరణ దక్కుతుంది. అలా టీవీ సీరియల్స్ ద్వారా మంచి ప్రేక్షకదరణను మరియు ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటి మనులలో శిరీష ఒకరు. ఈ నటి జెమినీ టీవీలో ప్రసారం అయిన మొగలిరేకులు సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
Advertisement
ఇందులో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈమె ఆ తర్వాత స్వాతి చినుకులు… మనసు మమత… రాములమ్మ… కాంచన గంగ… నాతిచరామి వంటి సీరియల్స్ లో నటించి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఇప్పటివరకు ఎన్నో సీరియల్లో నటించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి గురించి… ఆమె కుటుంబం గురించి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని ఈమె అభిమానులతో పాటు ఎంతోమంది మామూలు సీరియల్ అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.
Advertisement
అందులో భాగంగా ఈ నటి కుటుంబ వివరాలు మరియు ఇతర విషయాలను తెలుసుకుందాం. శిరీష సిరిసిల్లలో జన్మించింది. ఈ నటి తండ్రి పేరు పాపయ్య. శిరీష కు ఇద్దరు అక్కలు ఉన్నారు. ఈమె అక్కల పేర్లు రజిత , సౌజన్య. శిరీష మొదటి అక్క రజిత 16 సంవత్సరాల వయసు లోనే వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె భర్త ప్రోత్సాహంతో దూరదర్శన్ లో పలు కార్యక్రమాలలో పాల్గొంది. ఆ తర్వాతలో పలు సీరియల్లలో నటించింది.
అలాగే శిరీష రెండవ అక్క సౌజన్య కూడా పలు సీరియల్ లో నటించింది. వీరిద్దరి ప్రోత్సాహంతో… ప్రోద్బలంతో శిరీష సీరియల్ నటిగా కెరియర్ను ప్రారంభించింది. అందులో భాగంగా మొగలిరేకులు సీరియల్ తో తన కెరీర్లు మొదలుపెట్టి ఈ సీరియల్ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సీరియల్ లలో ఒక అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది.