సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె గుంటూరులో పుట్టి పెరిగినప్పటికీ విజయవాడలో విద్యాభ్యాసం చేసింది. తోలుత టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా,అసిస్టెంట్ దర్శకురాలుగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో ఆమె చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. తోలుత ఆమెకు గులాబీ, ఎగిరే పావురమా మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూనే చాలామంది తెలుగు హీరోయిన్లకు వాయిస్ అందించింది. దాదాపు 500 కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది సింగర్ సునీత.
READ ALSO : “లవ్ యు రాజా” అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?
Advertisement
అయితే సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. ఆమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనినీ పెళ్లి చేసుకుంది. వీరి లేట్ వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సునీత వివాహం చేసుకున్న వ్యక్తి పూర్తి పేరు రామకృష్ణ వీరపనేని. ఈయన ఆస్ట్రేలియాలో పై చదువులు చదివాడు. భారతదేశానికి వచ్చి వ్యాపారవేత్తగా ఎదిగారు.
Advertisement
రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయి. మ్యాంగో మ్యూజిక్ కి సునీత ఎన్నో పాటలు పాడారు. అలా వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సునీత కోరిక మేరకు మంచి స్నేహితులుగా ఉన్న వీరు దంపతులుగా మారారు. మొదటి నుంచి సోషల్ మీడియాకి రామ్ వీరపనేని దూరంగా ఉన్నారు. యూట్యూబ్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న మ్యాంగో మ్యూజిక్ కి ఈయన సీఈఓ, తమిళం, హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రైట్స్ తీసుకుని యూట్యూబ్ లో పెట్టేవాడు. ఈ బిజినెస్ ద్వారా ఆయన ఎన్నో కోట్ల రూపాయలను సంపాదించారు. ఆయన హైదరాబాద్ లో పెద్ద, పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఉన్నాయట.
Read Also : తగ్గేదేలే.. ‘జనసేన’ కండువాలతో పెళ్లి..ఫోటోలు వైరల్ !