Home » నా రెండో పెళ్లి గురించి మీకెందుకు…వాళ్ల‌కు సింగ‌ర్ సునిత స్ట్రాంగ్ కౌంట‌ర్..!

నా రెండో పెళ్లి గురించి మీకెందుకు…వాళ్ల‌కు సింగ‌ర్ సునిత స్ట్రాంగ్ కౌంట‌ర్..!

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాప్ సింగ‌ర్ లో సునిత కూడా ఒక‌రు. సునిత ఎన్నో సూప‌ర్ హిట్ పాట‌ల‌తో ప్లేబ్యాక్ సింగ‌ర్ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. సునిత గొంతుకు చాలా మంది ఫిదా అయ్యారు. కేవ‌లం సింగ‌ర్ గానే కాకుండా సునిత సింగింగ్ ప్రోగ్రాంల‌లో జ‌డ్జిగా చేసి కూడా అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు.

Advertisement

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో మిగితా సింగ‌ర్ ల‌తో పోలిస్తే సునితకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె గొంతుతో పాటూ ఆమె అందానికి సైతం అభిమానులు ఉండ‌ట‌మే సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ కు కార‌ణం. ఇక సింగ‌ర్ గా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న సునిత జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదురుకున్నారు. చిన్న వ‌య‌సులోనే సునిత‌కు వివాహం కాగా ఓకూత‌రు మ‌రియు కుమారుడు ఉన్నారు.

singer sunitha son akash

Advertisement

పెళ్లి త‌ర‌వాత సునిత భ‌ర్త వేధింపుల‌కు గురిచేసేవాడ‌ట దాంతో అత‌డికి విడాకులు ఇచ్చి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి తండ్రీ తానే అయ్యింది. ఇక సునిత రెండేళ్ల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీర‌ప‌నేనిని రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే లేటు వ‌య‌సులో రెండో పెళ్లి ఏంటి అంటూ సునిత‌పై దారుణంగా ట్రోల్స్ వ‌చ్చాయి.

sunita ram veerapaneni

కాగా తాజాగా సునిత త‌న పెళ్లి స‌మ‌యంలో వ‌చ్చిన ట్రోల్స్ పై ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ఇంట‌ర్యూలో సునిత మాట్లాడుతూ…సింగ‌ర్ చిత్ర త‌ర‌వాత తాను అన్ని పాట‌ల‌ను పాడాన‌ని చెప్పారు. ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతున్నా క‌దా అన్నీ వ‌దిలేసి నా వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంస్కారం ఉన్న‌వాళ్లు ఇలా మాట్లాడ‌రు అంటూ సునిత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Visitors Are Also Reading