సింగర్ సునిత ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో చాలా మంది సింగర్స్ ఉన్నా కూడా సునితకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సునిత సింగర్ గా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. సునిత పాడుతున్నా మట్లాడుతున్నా ప్రేక్షకులు అలా వింటూ ఉండిపోతారు అంటే ఆమె గొంతు ఎంత మదురంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సునిత తన తియ్యని గొంతుతోనే కాకుండా అందంతోనూ అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
Advertisement
ఇక సింగర్ సునితకు చిన్న వయసులోనే వివాహం జరగ్గా ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఓ కూతురు మరియు కుమారుడు ఉన్నారు. కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్దం అవుతున్నాడు. ఇక సింగర్ సునిత లేటు వయసులో మ్యాంగో రామ్ ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సునిత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తల పై తాజాగా సింగర్ సునిత స్పందించింది.
నేను ప్రెగ్రెంట్ ఆ…ఆ విషయం నాకే తెలియదు. ఆ విషయం వాళ్ల ఆలోచనా విధానానికే వదిలేస్తున్నా….వాళ్లు నన్ను నా జీవితాన్ని ఏం చేయలేరు. అంటూ సునిత కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ వార్తలు రావడానికి ఓ కారణం కూడా ఉంది. సునీత పెళ్లి తరవాత మామిడితోటలో మామిడి పండు పట్టుకుని ఫోటో ను షేర్ చేసింది. ఆ రోజు నుండే సునిత ప్రెగ్రెంట్ అంటూ వార్తలు షురూ అయ్యాయి.