గోవా నుండి భారీగా డ్రగ్స్ హైదరాబాద్ కు సప్లై అవుతున్నట్టు గుర్తించడంతో పోలీసులు డ్రగ్స్ కదలికలపై నిఘా పెట్టారు. ప్రతి వీకెంట్ పబ్స్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేథప్యంలోనే హైదరబాద్ లోని రాసిసన్ బ్లూ హోటల్ పై కూడా పోలీసులు రైడ్ చేశారు.ఈ రైడ్ లో అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నట్టు గుర్తించారు. ఇక పార్టీలో టాలీవుడ్ సింగర్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లింగజ్ ఉన్నట్టు గుర్తించారు.
Advertisement
Advertisement
అంతే కాకుండా రాహుల్ సిప్లింగజ్ తో పాటూ మొత్తం 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారు జామున పోలీసులు రైడ్ చేసినట్టు సమాచారం. ఇక ఈ భారీ రేవ్ పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ వాడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువకులతో పాటూ పబ్ లో యువతులు కూడా ఉన్నారు. అయితే నిబంధనలకు విరుద్దంగా తెల్లవారుజామున మూడు గంటల వరకూ పబ్ ను నడపడం వల్లనే వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు డ్రగ్స్ కోణం కూడా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రస్తుతం చాలా మందిని పోలీసులు విడిచిపెట్టగా మరో 30 మంది అదుపులో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. నిబంధనలు పాటించని పబ్ లపై ఉక్కుపాదం మోపుతోంది. అంతే కాకుండా డగ్స్ ను పూర్తిగా కంట్రోల్ చేయాలని పోలీసులపై ఒత్తిడి పెంచింది.