జానపద పాటలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సింగర్ మంగ్లీ మాత్రమే. తను ఏ పాట పాడిన తప్పనిసరిగా సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఆమె గొంతులో ఏముందో ఏమో కానీ ఆమె పాట వింటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి మంగ్లీ మామూలు న్యూస్ ఛానల్ యాంకర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి, ఎన్నో ఆపసోపాలు పడి జానపద పాటలు పాడుకుంటూ గాయకురాలిగా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సింగర్ లలో మంగ్లీ కూడా ఒక స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకుంది.
Advertisement
మంగ్లీ వ్యక్తిగత విషయాల్లోకి వెళితే మంగ్లీ ఏజ్ 28 సంవత్సరాలు. ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్. ఆమె సాంప్రదాయ బంజారా వస్త్రధారణ, ఆచారాలు, తెలంగాణ యాసను ప్రమోట్ చేయడం ద్వారా జనాల్లో మంచి పేరు సంపాదించుకుంది. మొదట్లో టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించింది. మంగ్లీ ఆపై తెలంగాణ బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, సమ్మక్క సారక్క జాతర పండుగలను వర్ణించే పాటల ద్వారా బాగా పాపులర్ అయింది.
Advertisement
గతంలో ఒక్కో పాటకు దాదాపు రూ. 20,000 వసూలు చేసిన ఈ లేడీ సింహం ఇప్పుడు తన రెమ్యూనరేషన్ తో మేకర్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఒక పాటకు దాదాపు రూ. 2 లక్షలు వసూలు చేస్తుందట మంగ్లీ. మాస్ మహారాజా తాజా కామెడీ యాక్షన్ డ్రామా ధమాకా లోని జింతక్ చితాక్ పాట కోసం ఆమె ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుందని ఇండస్ట్రీ టాక్. మంగ్లీ స్వేచ్ఛ, గువ్వా గోరింక, మాస్ట్రో వంటి సినిమాల్లో కూడా నటించింది.
READ ALSO : చరణ్ సంచలన వ్యాఖ్యలు…మౌనం వీడితే తట్టుకోలేరని రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్!