ఈ మధ్య సెలబ్రెటీలు రెండు మూడు వివాహాలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ భూమ మౌనికరెడడ్డిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ కూడా ఇది రెండో వివాహమే. అంతే కాకుండా సింగర్ సునితకు గతంలో వివాహం కాగా భర్తతో విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ గా సునిత మాంగో రామ్ ను రెండో వివాహం చేసుకున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ సింగర్ కౌసల్య కూడా రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కౌసల్య టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి అభిమానులను సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే కౌసల్య ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కాగా ఆ తరవాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
Advertisement
ఇక తాజా ఇంటర్వ్యూలో కౌసల్య తన లైఫ్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన భర్త తనను చాలా వేధించేవాడని తెలిపింది. బాబు పుట్టిన తరవాత కేవలం బాబు కోసమే కలిసి ఉన్నానని చెప్పింది. బాబు పుట్టిన తరవాత కూడా అతడిలో ఎలాంటి మార్పు రాలేదని దాంతో తన భర్త రెండో పెళ్లి చేసుకునేవరకూ భరిస్తూనే ఉన్నానని తెలిపింది.
ఇక అతను రెండో పెళ్లి చేసుకోవడంతో విడాకులు తీసుకున్నానని బాబు చిన్న వయసులో ఉన్న సమయంతో ఎంతో కష్టపడ్డానని వెల్లడించింది. ఇప్పుడు తన కొడుకు పెద్దవాడయ్యాడని మళ్లీ పెళ్లి చేసుకోమని కోరుతున్నాడని చెప్పింది. దాంతో కొడుకు కోరిక మేరకు తన అభిప్రాయలకు మ్యాచ్ అయ్యే వ్యక్తి వస్తే రెండో పెళ్లి చేసుకుంటానని కౌసల్య స్పష్టం చేసింది. ఇక కౌసల్య చేసిన కామెంట్ లు చూస్తుంటే త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్టు కనిపిస్తుంది.
also read : ఇండియాలో టాప్ 5 ధనిక కుటుంబాలు ఇవే