నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికి. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నర్జియా నానికి హీరోయిన్ గా నటించింది. వేరు వేరు కమ్యూనిటీలకు చెందిన ఇద్దరు యువతి యువకులు ప్రేమించుకుంటే వచ్చే ఇబ్బందులు… ఆ తర్వాత వాళ్ళ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించుకునేందుకు పడే కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
Advertisement
ఈ సినిమా కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకోగా మరి కొంతమందిని నిరాశపరిచింది. దాంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే థియేటర్లలో కంటే ఈ సినిమాను ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో నెట్ ఫిక్స్ లో ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అత్తారింటికి అత్తారింటికి దారేది సినిమాకు ఒక కామన్ పాయింట్ ఉంది.
Advertisement
అత్తారింటికి దారేది సినిమాలో నదియా పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించిన సంగతి తెలిసిందే. ఇక నదియాకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే అప్పటికే పెద్ద కూతురుకు కోట శ్రీనివాసరావు మనవడితో నిశ్చితార్థం పూర్తవుతుంది. దాంతో తన రెండో కూతురు సమంతను ఇచ్చి పెళ్లి చేస్తానని కోటకు నది ఆ మాట ఇస్తుంది.
ఇక అంటే సుందరానికి సినిమాలో కూడా అదే మాదిరిగా ఓ సన్నివేశం ఉంది. ఈ సినిమాలో కూడా నదియా నానికి అత్తగా నటించింది. నదియా పెద్ద కూతురు ఓ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంటుంది. దాంతో నదియా రెండో కూతురైన నర్జియాను ప్రేమ వివాహం కాకుండా తాము చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతారు. ఇక ఇది గమనించిన ప్రేక్షకులు ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది అంటూ అత్తారింటికి దారేది సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.