యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోగా నటించాడు. అలా ఈ నటుడు నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా… భూమిక, అంకిత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా… ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.
Advertisement
ఈ మూవీ 9 జూలై 2003 వ సంవత్సరం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తాజాగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో 4కే వర్షన్ తో రీ రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అనేక ప్రచారాలను కూడా ఈ మూవీ బృందం నిర్వహించింది. ఈ మూవీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుండో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Advertisement
అలా ఎప్పటినుండో ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ నటుడి అభిమానులు ఈ మూవీ విడుదల అవుతుంది అని తెలియడంతో చాలా రోజుల నుండి ఈ మూవీ యొక్క టికెట్లను బుక్ చేసుకున్నారు. అలా భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు రీ రిలీజ్ కలెక్షన్ల విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 4.01 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రిలీజ్ అయిన సినిమాలలో 3.62 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన “ఖుషి” మూవీ నెంబర్ 1 స్థానంలో ఉంది. దానిని సింహాద్రి మూవీ బీట్ చేసింది.