సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపు ఊపేసినటువంటి భామ సిల్క్ స్మిత. తన అద్భుతమైన ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఏలూరు తాలూకా దెందులూరు మండలానికి చెందిన విజయలక్ష్మి అనే అమ్మాయి సిల్క్ స్మితగా మారి సిల్వర్ స్క్రీన్ పై ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఒకప్పుడు సిల్క్ స్మితకి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ ఉండేది. ముందుగా తన డేట్స్ తీసుకున్న తర్వాతనే హీరోలకు సినిమా స్టోరీనీ చెప్పేవారట.
తన అద్భుతమైన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమె నటించిన పాటలు అన్నీ ఒక సెన్సేషన్ గా మిగిలిపోయాయి. ఇక ఎంతో సాఫీగా సాగుతున్న తన జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆమె బలవన్మ***రణానికి పాల్పడింది. ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. లవ్ ఫెయిల్యూర్ తో మరణించింది అని కొందరు అంటే, మరికొందరు సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి మోసపోయిందని మరికొందరు అన్నారు. సిల్క్ స్మితకి తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తనమీద ఎంత ఇష్టమంటే ఒక కిల్లిని తెచ్చుకొని మరీ తనని కాస్త కొరికి ఇవ్వమని అడిగేవారట.
Advertisement
Advertisement
ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను ఆపిల్ తింటుండగా సిల్క్ స్మితని షాట్ రెడీ అయిందని పిలిచారట. దీంతో సిల్క్ స్మిత తిన్న ఆ ఆపిల్ ముక్కను అక్కడే వదిలేసి వెళ్లిందట. ఇక ఆపిల్ ముక్కను సిల్క్ స్మిత మేకప్ మ్యాన్ వేలం వేస్తే ఆ ఆపిల్ ముక్కను పోటీపడి మరి 26 వేలకి కొనుగోలు చేశారట. అంత క్రేజ్ ఉండేది సిల్క్ స్మితకి. అంతటి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అపస్మారక స్థితిలో మరణించింది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదట.
ఇవి కూడా చదవండి
- సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?
- 5 నిమిషాలు ఓర్చుకుంటే అయిపోతుంది.. నేహా శెట్టిని బలవంతం చేసిన డైరెక్టర్ ?
- Yuzvendra Chahal : చాహల్ కెరీర్ క్లోజ్.. ఇండియన్ వదిలి విదేశాలకు పయనం ?