భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐ అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాదులో జరిగింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ 2022-23 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ క్రికెటర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఇక మహిళ కేటగిరీలో అయితే బెస్ట్ క్రికెటర్ అవార్డు దీప్తి శర్మ కి దక్కింది. మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి జీవిత సాఫల్యం పురస్కారం వచ్చింది. అయితే 2019, 20, 21, 22 వరకు కూడా కరోనా కారణాల వలన బీసీసీఐ వార్షిక అవార్డులను ప్రధానం చేయలేకపోయింది. అందుకని ఇప్పుడు ఏకంగా నాలుగు సీసాలకి సంబంధించిన పురుషులు మహిళలు దేశవాళీ క్రికెటర్ల అవార్డులని ప్రధానం చేసేసింది.
Advertisement
Advertisement
2022-23 గానూ పాలీ ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్‌గా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కి అవార్డు వచ్చింది. (2021-22) కి పాలీ ఉమ్రిగర్ అవార్డు జస్‌ప్రీత్ బుమ్రా, (2020-21) రవిచంద్రన్ అశ్విన్, (2019-20) మహమ్మద్ షమీ లు గెలుచుకున్నారు. 2020-21, 2021-22 సంవత్సరానికి ఉత్తమ మహిళా క్రికెటర్‌గా స్మృతి మందాన నిలిచింది. 2019-20, 2022-23 సంవత్సరాలకు దీప్తి శర్మ అవార్డును సొంతం చేసుకుంది. అత్యధిక వికెట్లు తీసిన పూనమ్ యాదవ్ (2019-20), జులన్ గోస్వామి (2020-21), రాజేశ్వరి గైక్వాడ్ (2021-22), దేవికా యాదవ్ (2022-23) కూడా అవార్డు అందుకున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!