మెగా టోర్నీ 2023 ప్రపంచకప్ మహాసంగ్రామం నిన్న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 2023 ప్రపంచకప్ మహాసంగ్రామంలో భాగంగానే తొలిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ కంగు తినిపించింది. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా భారత్ వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడనుంది.
టైటిల్ ఫేవరెట్ జట్టు ఆస్ట్రేలియాతో టీమిండియా తన లక్ ను పరీక్షించుకోనుంది. ఈ మ్యాచ్ ముందు భారతజట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ కు డెంగ్యూ సోకింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే తొలి వరల్డ్ కప్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్ నాటికి గిల్ ను రెడీ చేసేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణ జ్వరమే అయితే గిల్ ఆడేందుకు అవకాశం ఉంది. డెంగ్యూ అయితే మాత్రం గిల్ దాదాపు సగం టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే అది టీమిండియాకు పెద్ద మైనస్ గా మారుతుంది.
Advertisement
Advertisement
ఎందుకంటే టీమిండియాలో గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది వన్డేల్లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతను 72.35 యావరేజ్ తో 1230 రన్స్ చేశాడు. 105 స్ట్రైకింగ్ రేటుతో 5 సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు. పైగా ఇదే ఏడాది గిల్ అద్భుతమైన ప్రదర్శనతో 208 రన్స్ తో డబుల్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లోను ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ లాంటి పటిష్ట జట్టుతో మ్యాచ్ కు ముందు గిల్ లేకపోవడం టీమిండియాకు భారీ షాక్ అని చెప్పాలి. గిల్ అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ను తుది జట్టులో తీసుకుంటారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
- Rashmi Gautam: జబర్దస్త్ రష్మీ గుడ్ బై..? కారణం ఏంటీ !
- Mama Mascheendra Review : “మామా మశ్చీంద్ర” రివ్యూ.. సుధీర్ హిట్టు కొట్టినట్లేనా ?
- Rules Ranjan Movie Review : రూల్స్ రంజన్ మూవీ రివ్యూ..