Home » కొత్త కారు కొన్న శ్రేయాస్ అయ్యర్.. ఎన్ని కోట్లంటే..?

కొత్త కారు కొన్న శ్రేయాస్ అయ్యర్.. ఎన్ని కోట్లంటే..?

by Azhar
Ad
భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కొత్త కారు కొన్నాడు. ఈరోజే మెర్సిడెస్ కు చెందిన అత్యంత లగ్జరీ కార్ ‘మెర్సిడెస్-ఏంఎంజీ జీ 63 మోడల్ కారును అయ్యర్ కొనుగోలు చేసాడు. ఈ కొత్త కారు 5 సెకండ్ల లోపే 0 నుండి 100 కిలో మీటర్ల వేగం అందుకుంటది. అయితే అయ్యర్ ఈ కారు కొన్న విషయాన్ని ప్రముఖ డీలర్‌ ల్యాండ్ మార్క్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులకు తెలియజేసింది.
అందులో ”శ్రేయస్ అయ్యార్‌ను మా మెర్సిడెస్ ఫ్యామిలీలోకి స్వాగతిస్తున్నం. ఇప్పటివరకు మీ కవర్ డ్రైవ్‌లను మేము చూసి ఆనదించాం. ఇక ఇప్పటి నుండి మీరు కూడా మా మెర్సిడెస్ డ్రైవింగ్‌ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాము’ అంటూ పోస్ట్ చేసింది ఆ ల్యాండ్ మార్క్. అయితే అయ్యర్ ఈ కారును .2.45కోట్ల ధరతో కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. గత ఐపీఎల్ సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఉన్న అయ్యర్.. ఈ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు న్యాయకత్వం వహించాడు.
ఇక ఈ ఐపీఎల్ ను బాగానే ఆరంభించిన కేకఆర్ జట్టు మధ్యలో జట్టులో ఎక్కువ మార్పులు చేయడం వల్ల వరుసగా 6 పరాజయాలను చవి చూసింది. దాంతో ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్న కేకేఆర్ సీజన్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. అయితే గత ఐపీఎల్ ముందు గాయంతో భారత జట్టులో స్థానం కోల్పోయిన అయ్యర్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఈ నెల 9 సౌత్ ఆఫ్రికా తో జరిగే టీ20 సిరీస్ లో భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చూడాలి మరి ఈ సిరీస్ లో అయ్యర్ ఎలా రాణిస్తాడు అనేది.

Advertisement

Visitors Are Also Reading