Telugu News » Blog » బాల‌య్య ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన అఖండ విల‌న్..యంగ్ హీరోలు కూడా వేస్ట్…!

బాల‌య్య ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన అఖండ విల‌న్..యంగ్ హీరోలు కూడా వేస్ట్…!

by AJAY
Ads

బాల‌య్య హీరోగా బాయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా అఖండ‌. ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభియ‌నయంతో ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింది. ఈ చిత్రంలో ప్ర‌గ్యాజైశ్వాల్ బాల‌య్య‌కు జోడీగా న‌టించి ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమాకు వ‌సూళ్ల వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా విజ‌యం తో బాల‌య్య బోయ‌పాటి కాంబోలో హాట్రిక్ న‌మోద‌య్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాయ‌ల్య యాక్ష‌న్ తో అద‌ర‌గొట్టారు.

Advertisement

అంతే కాకుండా బాల‌య్య చాలా సినిమాల్లో డూప్ లేకుండా ఫైట్ సీన్ల‌లో న‌టిస్తార‌న్న సంగతి తెలిసిందే. అయితే బాల‌య్య‌తో కలిసి అఖండ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించిన న‌టుడు శ్రావ‌ణ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు. బాల‌య్య ఫిట్నెస్ యాంక‌ర్ శ్రావ‌ణ్ ను ప్ర‌శ్నించగా…..తాను ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా మంది హీరోల‌ను చూశాన‌ని ఫిట్నెస్ అంద‌రికీ ఉంటుందని కానీ బాల‌య్య బాబు అంత ధైర్యం ఎవ‌రికీ ఉండ‌ద‌ని అన్నారు.

Advertisement

Balayya

Balayya akhanda movie review

ప్ర‌స్తుతం ఉన్న హీరోల‌కు ఎంతో ఫిట్నెస్ ఉన్నా బాల‌య్య బాబు అంత ధైర్యం ఉండ‌ద‌ని చెప్పారు. తాను ఫైట్ల స‌మ‌యంలో మోకాళ్ల‌కి క్యాప్స్ పెట్టుకుంటాన‌ని బాల‌య్య అవి కూడా పెట్టుకోర‌ని అన్నారు. ఎంతో కేర్ తీసుకున్నా దెబ్బ‌లు త‌గులుతాయ‌ని కానీ బాల‌య్య ఆ దెబ్బ‌ల‌ను ప‌ట్టించుకోరని అన్నారు. ప్ర‌తిరోజు బాల‌య్య‌కు షూటింగ్ లో చిన్న చిన్న దెబ్బ‌లు త‌గులుతాయ‌ని కానీ లెక్క‌చేయ‌రని అందుకే అంత స్ట్రాంగ్ గా ఉన్నారని అన్నారు.

Advertisement

ఆ బ్ల‌డ్ అంటే అంతే అని మ‌హానుబావులు అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా బాల‌య్య సెట్ లో డైలాగులు కూడా గ‌ట్టిగా చెబుతార‌ని గూస్ బంప్స్ వ‌స్తాయ‌ని అన్నారు. ఇక న‌టుడు శ్రావ‌ణ్ చేసిన కామెంట్లు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.