Home » ఇంద్రజ పెళ్ళికి అప్పట్లో ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా…?

ఇంద్రజ పెళ్ళికి అప్పట్లో ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా…?

by Azhar
Ad

తెలుగు సినీ అభిమానులకు యమలీల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఇంద్రజ. అయితే ఆలీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలవడంతో ఇంద్రజకు కూడా ఆఫర్లు అనేవి బాగానే వచ్చాయి. అలా తెలుగు, తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించిహ్ సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి కొంచెం దూరం అయ్యింది. కానీ మళ్ళీ సినిమాల్లో అమ్మ పాత్రలు చేస్తూ అభిమానులకు దగ్గరైంది.

Advertisement

ఇక ఈ క్రమంలోనే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇంద్రజ. రోజా లేనప్పుడు ఇంద్రజ జడ్జ్ గా చెయ్యడం.. ఆమెకు మంచి పేరు అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఆమెను జడ్జ్ గా చేస్తూ.. శ్రీ దేవి డ్రామా కంపెనీ అనే షోను ప్రారంభించగా… అడిల్లీ సూపర్ హిట్ అయ్యింది. కానీ ఈ మధ్యే రోజాకు ఏపీ సీఎం జగన్ క్యాబినెట్ లో చోటు రావడంతో ఆమె జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి జబర్దస్త్ లో మళ్ళీ జడ్జ్ గా చేస్తుంది ఇంద్రజ. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ఓ ప్రోమో అనేది విడుదల అయ్యింది. అందులో తన పెళ్లి ఖర్చు ఎంతో చెప్పి అందరికి షో ఇచ్చింది ఇంద్రజ.

Advertisement

అయితే తాజాగా వచ్చిన ప్రోమోలో వెంకీ తన భార్యను అందరికి పరిచయం చేసాడు. ఇక అదే సమయంలో తన పెళ్లి గురించి ఇంద్రజ మాట్లాడుతూ.. తన పెళ్ళికి వచ్చిన అతిధుల సంఖ్య 13 అని.. అలాగే తన పెళ్లి అయిన ఖర్చు అనేది 7,500 రూపాయలు అని చెప్పింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. అయితే 2005 లో ఇంద్రజ ప్రేమ పెళ్లి అనేది చేసుకుంది. ఆమె భర్త పేరు అబ్సన్. వీరికి ఓ కామం ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ ఆరేళ్ళ ప్రేమించుకొని… తర్వాత పెళ్లి అనేది చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ జట్టు మారిన అంబటి రాయుడు..!

కోహ్లీని తీసేస్తే బీసీసీఐకే నష్టం.. ఎలా అంటే..?

Visitors Are Also Reading