బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఆశించినంతగా ఫలితాలను అందుకుందో లేదో ఇక పక్కన పెడితే.. ఈ సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల పంట బాగనే పండిందనే చెప్పవచ్చు. ఈసారి పార్టిసిపేట్ చేసిన వారికి ఇచ్చిన అమౌంట్ చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ నోరు వెళ్లబెడుతున్నారు. పైనల్ గా ఒక్కొక్కరికీ ఎంత వచ్చిందో చూసినట్టు అయితే.. విన్నర్‌గా నిలిచిన సన్నీకి బాగానే వర్క్ అవుట్ అయింది.
Advertisement
సన్నీ షోలో ప్రవేశించేటప్పుడు వారానికి రెండు లక్ష రూపాయల చొప్పున అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా 15 వారాలున్నాడు కాబట్టి రూ.30 లక్షలు రెమ్యూనిరేషన్ ముట్టింది. దీంతో పాటు ఫ్రైజ్ మనీ రూ.50లక్షలు, సువర్ణ భూమి వారు ఇచ్చిన రూ.25 లక్షలు రూపాయలు విలువ గల ల్యాండ్, అదేవిదంగా 27 లక్షల గిప్ట్‌ను అందుకున్నాడు సన్నీ దీంతో పాటు కొటి రూపాయలకు పైగా బిగ్‌బాస్ ద్వారా సంపాదించుకున్నాడు. ఇక సెకండ్ స్థానంలో ఉండి రన్నరప్ గా నిలిచిన షణ్ముక్ జస్వంత్ కి విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువే వచ్చిందని టాక్. వారానికి నాలుగు లక్షల నుంచీ ఐదు లక్షల వరకూ పారితోషకాన్ని అందించినట్లుగా టాక్. షణ్ముక్ మొత్తం 15 వారాలకి 70 లక్షల కంటే పైనే వచ్చిందని చెప్తున్నారు. దీన్ని బట్టీ చూస్తే విన్నర్ ప్రైజ్ మనీ కంటే కూడా ఇది చాలా ఎక్కువ.
Advertisement
ఆ తర్వాత టాప్ 5 లో నిలిచిన సిరికి కూడా రెమ్యూనిరేషన్ బాగా వచ్చినట్లుగా తెలుస్తోంది. హౌస్ లోకి వెళ్లే ముందు వారానికి రెండు లక్షల రూపాయల వరకూ అగ్రిమెంట్ చేస్కున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టీ చూస్తే 15 వారాలకి దాదాపుగా 30 లక్షలు వచ్చినట్లుగా సమాచారం. దీంతో సిరి ఫుల్ హ్యాపీగా ఉందట. ట్రోఫీ గెలవకపోయినా ప్రైజ్ మనీలో సగం పైనే గెలుచుకుంది సిరి. ఇక టాప్ 5లో ఉన్న మానస్ కి కూడా బిగ్ బాస్ టీమ్ నుంచీ బారీగానే రెమ్యూనిరేషన్ వచ్చినట్లుగా టాక్. మానస్ కి వారానికి రెండు లక్షలకు పైగానే వచ్చిందని, మొత్తం మీద 40 లక్షల వరకూ 15వారాలకి అందుకున్నాడు అని అంటున్నారు. ఇక టాప్ 5లో ఉన్న మానస్ కి కూడా బిగ్ బాస్ టీమ్ నుంచీ బారీగానే రెమ్యూనిరేషన్ వచ్చినట్లుగా టాక్. మానస్ కి వారానికి రెండు లక్షలకు పైగానే వచ్చిందని, మొత్తం మీద 40 లక్షల వరకూ 15వారాలకు అందుకున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గానే మారుతుంది