Home » శోభన్ బాబు, చంద్రమోహన్ దగ్గర తీసుకున్న 2 లక్షలతో 30 ఎకరాలు కొన్నారని మీకు తెలుసా..?

శోభన్ బాబు, చంద్రమోహన్ దగ్గర తీసుకున్న 2 లక్షలతో 30 ఎకరాలు కొన్నారని మీకు తెలుసా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి మేటినటుల్లో శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ ఎంతో పేరు తెచ్చుకున్నారు.వీరు మొదటగా మద్రాసులో ఇండస్ట్రీ ఉన్న సమయంలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ఇక ఈ హీరోలు తిరుగులేని స్టార్లుగా ఎదిగారని చెప్పవచ్చు. అలనాటి నటుల్లో శోభన్ బాబు, చంద్రమోహన్ మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉండేదట. అయితే వారి ఫ్రెండ్షిప్ గురించి కొన్ని విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు చంద్రమోహన్.. అప్పట్లో చంద్రమోహన్, శోభన్ బాబు సినిమాల్లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న నటులు..

Advertisement

also read:Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

వీరు మద్రాస్ లో ఉండగానే నటన రంగంలో స్టార్లుగా మారారు.. ఈ తరుణంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాదుకు షిఫ్ట్ అయింది.. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వయంగా చంద్రమోహన్, శోభన్ బాబులకు ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చేయండి. మీరు మంచి నటులు, ఇండస్ట్రీకి ఎంతో అవసరం, మీరు అక్కడ ఉండటంవల్ల మీ పాత్రలు మిస్ అవుతున్నాయని అన్నారట. కానీ చంద్రమోహన్ మరియు శోభన్ బాబు మాత్రం ఏవైనా పాత్రలు ఉంటే ఇక్కడి నుంచి వచ్చి చేస్తాం, అక్కడికి రామంటూ తెగేసి చెప్పారట. ఇలా చెప్పిన నటుల్లో మేమిద్దరం మాత్రమే ఉన్నామని చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. కట్ చేస్తే శోభన్ బాబు చంద్రమోహన్ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే శోభన్ బాబు అనేక ప్రాపర్టీస్ కొన్నారట..

Advertisement

ఆయన ఏ సినిమా నుంచి డబ్బు వచ్చిన భూములు కొనేవారని, దీనికి ప్రధాన కారణం మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు అంటూ చెప్పుకొచ్చేవారట శోభన్ బాబు. ఈ విధంగా ఆయన చంద్రమోహన్ దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని 30 ఎకరాలకు పైగా వ్యవసాయానికి సంబంధించిన భూమిని కొన్నారని ఆయన అన్నారు. ఎంతో ఇష్టపడి శోభన్ బాబు కొనుక్కున్న ఈ మామిడి తోటలోనే తన నలుగురు పిల్లలకు ఘనంగా పెళ్లి చేశారని ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వచ్చిందని చంద్రమోహన్ తెలియజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో భూములపై ఇన్వెస్ట్ చేసిన నటులు శోభన్ బాబు మరియు మురళీమోహన్ అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా శోభన్ బాబు తన సినిమాల్లో వచ్చిన డబ్బంతా భూముల పైన ఇన్వెస్ట్ చేసి చాలా కొన్నారని, ప్రస్తుతం వాటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన తెలియజేశారు..

also read:

Visitors Are Also Reading