Ad
భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు పాకిస్థాన్ మాజీ బౌలర్ షోఐబీ అక్తర్ వార్నింగ్ ఇచ్చాడు. సెహ్వాగ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని… అతనికి ఐసీసీ కంటే ఎక్కువ నియమాలు తెలిస్తే మాట్లాడ వచ్చు అని పేర్కొన్నాడు. అసలు ఏం జరిగిందంటే… తాజాగా ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అక్తర్ బౌలింగ్ గురించి సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
సెహ్వాగ్ మాట్లాడుతూ… అక్తర్ బౌలింగ్ కాకుండా త్రో చేసేవాడు అని పేర్కొన్నాడు అతని బౌలింగ్ సమయంలో అక్తర్ మోచేతి స్థిరంగా ఉండదు. అందుకే అతను కొన్నిసార్లు త్రో బౌలింగ్ చేసేవాడు. ఈ విషయం అక్తర్ కు కూడా బాగా తెలుసు. అది నిజాం కాకపోతే… ఐసీసీ అక్తర్ పై నిషేధం ఎందుకు విధించుతుంది అని అన్నాడు. అలాగే నేను బ్రెట్‌లీ బౌలింగ్‌ను సులువుగా ఆడేవాడిని. ఎందుకంటే అతను మోచేయి సరిగ్గా తిప్పుతూ బౌలింగ్ చేసేవాడు. కానీ అక్తర్ ఆలా కాదు. బ్యాటర్ రెండు, మూడు ఫోర్లు కొడితే.. అంతే సంగతి.. తర్వాతి బంతి తలమీదకు లేదా యార్కర్లతో అరికాళ్లపైకి అయిన వస్తుంది అని సెహ్వాగ్ అన్నాడు.
అయితే ఇప్పుడు సెహ్వాగ్ కామెంట్స్ పైన అక్తర్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న ఈ సొసైల్ మీడియా ప్రపంచంలో సెహ్వాగ్ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచింది. నీకు ఐసీసీ కంటే రూల్స్ ఎక్కువగా తెలుసా ఏమైనా..? ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు చెడిపోయేలా చేయకూడదు. నేను సెహ్వాగ్ ఇంటర్వ్యూ చేయలేదు. అతను కామెడీగా అన్నాడో.. సీరియస్ గా అన్నాడో నాకు తెలియదు. అతను ఓ మంచి ఆటగాడు. నాకు కూడా మంచి మిత్రుడు అని అక్తర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
సాహాకు బ్యాడ్ టైం.. అన్ని గొడవలే..!
SRH అందుకే ఈ సీజన్ లో ఓడిపోయింది.. వారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే..?
Advertisement