ఈ ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియా వేదిక టీ20 ప్రపంచ కప్ 2022 మెగా టోర్నీ జరగనున్న విషయం అంధారికి తెలిసిందే. అయితే ఈ టోర్నీకి బలమైన జట్టును పంపమంటూ ఇండియాకు పాక్ ఆటగాళ్లు సలహా ఇస్తున్నారు. అయితే ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలలో ఇండియాను పాకిస్థాన్ మొదటిసారిగా గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఓడించింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు కొంత తడబడటంతో 152 పరుగుల లక్ష్యానేపాక్ ముందు ఉంచాం. దానిని పాక్ ఒక్క వికెట్ కూడా పడకుండా చేధించింది. అందువల్ల వారి కళ్ళు నెత్తికి ఎక్కి అంతకముందు మూడుసార్లు మనం వారిని ఓడించం అనే విషయం మర్చిపోయారు.
Advertisement
అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్… వచ్చే ప్రపంచ కప్ కు మంచి జట్టును ఎంపిక చేసి పంపాలని అన్నాడు. ఈ టోర్నీలో మా పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ కోసం మాములు జట్టును పంపించకండి. ఆ జట్టును భారత సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ అంత కలిసి బాగా చర్చించి ఎంపిక చేయండి. ఎందుకంటే ఈ ఏడాది కూడా గత ఏడాది మాదిరి మాకు సులువైన విజయం లభించకూడదు కదా అని పేర్కొన్నారు. అదే విధంగా బలమైన జట్టును పంపిస్తేనే మమల్ని వధించే అవకాశం ఉంటుంది అని చెప్పాడు.
Advertisement
అయితే ఈ ఏడాది పాక్, ఇండియా రెండు జట్లు చాలా భిన్నంగా ఉన్నాయి. అలాగే ఈ రెండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ మెల్‌బోర్న్ లో ఉంటుంది. అందువల్ల మొదట బ్యాటింగ్ చేసిన వారికి గెలుపు సులవుతుంది. అయితే ఈ స్టేడియంలో ఉండే లక్ష మంది అభిమానులలో 70 శాతం ఇండియాకే మద్దతు ఇస్తారు. కాబట్టి పాకిస్థాన్ పైన ఒత్తిడి ఉంటుంది. అలాగే అంత మంది సపోర్టర్ల మాదే ఓడిపోతామేమో అనే భయం ఇండియాకు కూడా ఉంటుంది. ఈ రెండు ఆ రెండు జట్లను దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి అక్తర్ అన్నాడు.
ఇవి కూడా చదవండి :