Home » కోహ్లీ టీ20లకు వీడ్కోలు చెప్పాల్సిందే..!

కోహ్లీ టీ20లకు వీడ్కోలు చెప్పాల్సిందే..!

by Azhar
Ad
భారత  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్లోకి వచ్చాడు. దాంతో ఇన్ని రోజులుగా ఎదురు చుసిన కోహ్లీ అభిమానుల కల అనేది ఇప్పుడు తీరింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. మూడు మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీలు అనేవి చేసాడు. దాంతో కోహ్లీ ఇస్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోషిస్తుంటే.. కోహ్లీ టీ20లకు వీడ్కోలు చెప్పాల్సిందే అని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు.
అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ లో భారత దిగ్గజ ఆటగాడు సంచి టెండ్యూలక్ర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయాలంటే అది కేవలం ఒక్క విరాట్ కోహ్లీ వల్లే సాధ్యం అవుతుంది ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇక ఇప్పటికే కోహ్లీ తన కెరియర్ లో 70 సెంచరీలు అనేవి చేసాడు. కానీ గత మూడేళ్ళుగా విరాట్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. చివరిగా 2019 లో శతకం అనేది చేయగలిగాడు కోహ్లీ.
దాంతో అందరూ ఇప్పుడు కోహ్లీ సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో అక్తర్ మాట్లాడుతూ.. సచిన్ 100 సెంచరీల రికార్డు ఒక్క కోహ్లీ మాత్రమే బ్రేక్ చేయగలడు. అయితే అది అతను టీ20 లకు వీడ్కోలు చెప్పినప్పుడే సాధ్యం అవుతుంది. ఎందుకంటే.. టీ20 లలో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. కానీ విరాట్ ఈ ఫార్మాట్ ను వదిలేస్తే.. వన్డే, టెస్టుల పైన బాగా ఫోకస్ చేయగలడు.. సెంచరీలు కొట్టగలడు అని అక్తర్ అన్నాడు.

Advertisement

Visitors Are Also Reading