పరిచయం :
ప్రస్తుతం హీరోలు ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తుంటే… కోలీవుడ్ హీరోలు వచ్చి టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో శివ కార్తికేయన్ టాలీవుడ్ దర్శకుడు అనుదీప్ కేవితో ప్రిన్స్ అనే సినిమాలో నటించారు. శివ కార్తికేయన్ ఇప్పటికే కాలేజ్ డాన్, డాక్టర్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Advertisement
Advertisement
ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో అనుదీప్ కేవితో చేతులు కలిపారు. అనుదీప్ కేవి జాతి రత్నలు సినిమ తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తాజాగా అనుదీప్ కేవి దర్శకత్వంలో శివ కార్తికేయ నటించిన ప్రిన్స్ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? శివ కార్తికేయన్ టాలీవుడ్ లో సక్సెస్ అయ్యాడా? అనుదీప్ కెవికి జాతిరత్నాలు తర్వాత మరో హిట్ పడిందా అన్నది చూద్దాం.
కథ :
సినిమా కథ విషయానికి వస్తే చాలా సింపుల్ కథ. ఓ ఊరిలో హీరో టీచర్ పనిచేస్తూ ఉంటాడు. అదే స్కూల్ లో మరియా బోషప్కా ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. మరియా విదేశీయురాలు కాగా భారత్ లోని స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరుతుంది. ఓకే స్కూల్ లో పనిచేస్తున్న హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. ఆ తర్వాత హీరో …హీరోయిన్ ప్రేమను గెలవడానికి నానా తంటాలు పడతాడు. కాగా ఆ పాఠశాల ఉన్న గ్రామ ప్రజలంతా హీరోకు మద్దతుగా నిలుస్తారు. చివరకు హీరో హీరోయిన్ ను గెలిచాడా లేదా అన్నదే ఈ సినిమా కథ.
సినిమా ఎలా ఉంది అంటే…?
ఈ సినిమా కూడా జాతి రత్నాలు లాంటిదే. అస్సలు లాజిక్స్ వెతక్కూడదు. అదేవిధంగా సినిమాపై ఎక్కువ అంచనాలు కూడా పెట్టుకోవద్దు. సిల్లీ కామెడీతో లాజిక్స్ లేకుండా తెరకెక్కించిన సినిమానే ప్రిన్స్. సినిమా ప్రారంభంలో కొన్ని లవ్ ఎమోషన్ సీన్లు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో ప్రారంభం నుండి ఎండింగ్ వరకు వచ్చే కామెడీ సన్నివేశాలు కొన్నిసార్లు బోరింగ్ గా కూడా అనిపిస్తాయి. ఈ సినిమా ప్రేమ కథ అయినప్పటికీ ప్రేమలో ఉండే సంఘర్షణలను.. ఎమోషన్స్ సైతం దర్శకుడు సిల్లిగానే చూపించాడు. అది కొంతమంది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు కానీ జాతి రత్నాలు క్లైమాక్స్ లో కూడా ఎండింగ్ అదేవిధంగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. సినిమాలో హీరోయిన్ మరియా చాలా అందంగా కనిపిస్తుంది. సత్యరాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. సినిమా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే యావరేజ్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. తమన్ అందించిన స్వరాలు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా కథలో లాజిక్స్ లేనప్పటికీ కామెడీని ఎంజాయ్ చేసేవాళ్లు ప్రిన్స్ సినిమాకు హ్యాపీగా వెళ్ళవచ్చు.