Home » తెలుగువారికి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ఉంది- శింబు

తెలుగువారికి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ఉంది- శింబు

by Azhar

మన్మధ, వల్లభ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ నటుడు శింబు. వి.హౌస్ ప్రొడక్షన్ పతాకంపై సాయిసన్ శింబు, యస్.జె.సూర్య, కల్యాణి ప్రియదర్శిని నటీనటులుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో  సురేష్ కమాట్చి నిర్మించిన తమిళ్ చిత్రం “మానాడు” ను తెలుగులో “ది లూప్‌” పేరుతో డబ్బింగ్ చేశారు. తెలుగులో వస్తున్న ఈ “లూప్‌” చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్, బన్ని వాసులు గ్రాండ్ గా తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో సాయిసన్ శింబు పాత్రికేయ మిత్రులతో  మాట్లాడుతూ.

మా ఇద్ద‌రి మ‌ధ్య కూడా చాలా మంచి స్నేహం ఉంది. ఈ సినిమాలో ఆయ‌న చాలా కీల‌క పాత్ర పోషించారు. స్పైడ‌ర్ చిత్రంలో కంటే కూడా చాలా ఎక్కువ విల‌నిజం ఈ సినిమాలో కనిపిస్తుంది. సూర్య పాత్ర ఎలా ఉంటుందంటే విల‌నిజం చూపిస్తూనే ప్రేక్ష‌కుడు న‌వ్వేలా ఉంటుంది. ఇందులో మాఇద్ద‌రిది టామ్ అండ్ జ‌ర్రీ టైప్‌లో ఉంటుంది. ఇది ఓ కొత్త ర‌క‌మైన క‌థ‌లా ఉంటుంది. ఈ చిత్రంలోని సాంగ్స్ అవ‌స‌రం మేర‌కు మాత్ర‌మే ఉంటాయి. ఎక్కువ‌గా ఉండ‌వు. ఒక పెళ్ళి సాంగ్‌, ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. రెండూ బాగా హిట్ అయ్యాయి. మ‌న్మ‌ధ మూవీటైప్ సాంగ్స్‌లానే ఇవి కూడా హిట్ అయ్యాయి. ఈ చిత్రం ఎలాగైనా స‌రే తెలుగులో విడుద‌ల‌వ్వాల‌ని ఎంతో ఆశ‌క్తిగా ఎదురు చూశాను. దానికి నాకు ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసుగారు చాలా హెల్ప్ చేశారు. తెలుగులో ఈ చిత్రం రావ‌డానికి కార‌ణం ఒక‌ర‌కంగా చెప్పాలంటే బ‌న్నీవాసుగారే. తెలుగు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా కొత్త‌త‌రం క‌థ‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఉంటారు.

ఎప్ప‌టికప్పుడు కొత్త‌ద‌నాన్ని కోరుకుంటారు. నాని ఈగ చిత్రం చాలా బావుంటుంది. త‌ను ఆ చిత్రంలో చేయ‌డం చాలా గ్రేట్ ఎలా అలా మొత్తం సినిమాలో ఒక ఈగ పాత్ర‌లో పోషించ‌డం అంటే మాములు విష‌యం కాదు. దానికి ఆయ‌న ఒప్పుకోవ‌డం గ్రేట్ అన్నారు. అలాగే ప్ర‌స్తుతం పుష్ప కూడా క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతుంది. అలా నా సినిమాలు కూడా తెలుగులో రావాల‌ని కోరుకుంటున్నాను. క‌రోనా వ‌ల్ల కాస్త వ‌చ్చింది త‌ప్పించి నేను ప్ర‌త్యేకించి ఎప్పుడూ గ్యాప్ తీసుకోలేదు. ఇక ఇందులోని యాక్ష‌న్ సీన్స్ ఎలా ఉంటాయ‌ని అడిన ఓ జ‌ర్న‌లిస్ట్‌కి ఆయ‌న స‌మాధానంగా యాక్ష‌న్స్ సీన్స్‌ని భారీగా ప్లాన్ చేశారు. అవి చెప్పేకంటే సినిమాలో ఆ సీన్స్ వీక్షించేట‌ప్పుడు ప్ర‌తి ఒకళ్ళు ఎంజాయ్ చేస్తారు అని శింబు చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యురియాసిటీ కలిగిస్తుంది. ఇందులో ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది.

ఈ సినిమా తరువాత గౌతమ్ మీనన్ తో మూడవ సారి సినిమా చేస్తున్నాను. ఇది తెలుగులో విడుదల అవుతుంది. గౌతమ్ కార్తీక్ తో కన్నడ రీమేక్  ఒక సినిమా చేస్తున్నాను.ఈ రెండు సినిమాలకు కూడా ఏ.ఆర్. రహమాన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు.అలాగే గోకుల్ డైరెక్షన్ లో కరోనా పేసెంట్ గా “కరోనా కుమార్” మూవీ చేస్తున్నాను.ఇది వెరీ ఫన్నీ లవ్ స్టోరీ చేస్తున్నాను అని ముగించారు.

Visitors Are Also Reading