భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కు విడాకులు మంజూరు అయ్యాయి. మానసిక క్రూరత్వం గ్రౌండ్స్ మీద విడాకులను ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది. ధావన్ దాఖలు చేసిన పిటిషన్ లో చేసిన ఆరోపణలపై వాదించడంలో కానీ, డిఫెండ్ చేసుకోవడంలో కానీ ధావన్ భార్య అయేషా ముఖర్జీ ఫెయిల్ అయింది. కాబట్టి ఆ ఆరోపణలను కోర్టు అంగీకరిస్తూ విడాకులు మంజూరు చేసింది. తన కుమారుడికి దూరంగా ఉండేలా చేస్తూ ధావన్ మానసికంగా బాధపడేలా అయేషా చేసినట్టు కోర్టు విచారణలో తేలింది.
ధావన్ మరియు అయేషా 2012లో వివాహం చేసుకున్నారు. అయేషాకు అంతకుముందే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. విడాకుల అనంతరం దావన్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఓ బాబు జన్మించారు. అయితే విడాకులు మంజూరు చేసిన కోర్టు ఆ బాబు కస్టడీ గురించి తీర్పు ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ ఆ అబ్బాయి ధావన్ ను అప్పుడప్పుడు కలిసేందుకు కలిసి ఉండేందుకు, వీడియో కాల్ మాట్లాడుకునేందుకు అనుమతినిచ్చింది. అలాగే ఆస్ట్రేలియాలో ఉన్న ఆ అబ్బాయిని స్కూల్ వెకేషన్ లో కనీసం సగం రోజులైనా ఇండియాకు తీసుకురావాలని అయేషాను కోర్టు ఆదేశించింది.
Advertisement
Advertisement
పెళ్లి సమయంలో తనతోనే కలిసి ఉంటానని ఆయేషా మాట ఇచ్చిందని అయితే దాన్ని నిలబెట్టుకోలేదని, తనకు అంతకుముందే ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల అక్కడే ఉండిపోతుందంటూ ధావన్ పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే ధావన్ తన డబ్బుతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ప్రాపర్టీలలో 99 శాతం ఓనర్షిప్ తన పేరు మీద రాయాలని ఆయేషా ఇబ్బంది పెడుతోందని ఆరోపించాడు. ఈ వాదనలను అంగీకరించిన కోర్టు విడాకులను మంజూరు చేసింది. అయితే శిఖర్ ధావన్, ఆయేషాల 11 సంవత్సరాల వివాహ జీవితంలో దాదాపు 8 ఏళ్లుగా వీళ్ళు విడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ 8 సంవత్సరాల కాలంలో ధావన్.. ఆయేషాకు ఏకంగా 13 కోట్ల వరకు ఇచ్చినట్లు ధావన్ తరఫు లాయరు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆమె భారాన్ని మొత్తం ధావన్ భరించాడని తెలిపాడు.
ఇవి కూడా చదవండి
- విడాకులు తీసుకున్న భారతీయ క్రికెటర్లు వీరే..!
- హీరో కావలసిన నాజర్ కొడుకు 9 ఏళ్లుగా మంచం పై జీవచ్చవంగా వున్నాడు !
- Anasuya Bharadwaj : ఆ ప్లేస్ లో సీక్రెట్ టాటూ చూపించిన అనసూయ..!