Home » భారత్ విజయానికి ఐపీఎల్ కారణమంటున్న కెప్టెన్..!

భారత్ విజయానికి ఐపీఎల్ కారణమంటున్న కెప్టెన్..!

by Azhar
Ad
సీనియర్ ఆటగాళ్లకు అందరికి విశ్రాంతి అనేది ఇచ్చి.. వెస్టిండీస్ పర్యటనలో భాగమైన వన్డే సిరీస్ కు కేవలం యువ ఆటగాళ్లను ఎక్కువగా ఎంపిక చేసి పంపింది బీసీసీఐ. ఇక ఈ యువ జట్టుకు కెప్టెన్ గా సీనియర్ ఓపెనర్ శివారు ధావన్ ను ఎంపిక చేసింది. అయితే మొత్తం యువకులే ఉండటంతో విండీస్ ను సొంత గడ్డపై ఓడించడం కష్టం అని చాలా మంది భావించారు. కానీ అందరి ఆలోచనలు తప్పుగా చేస్తూ.. మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు వన్డేలలో విజయం సాధించిన టీం ఇండియా ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను కూడా గెలుచుకుంది.
అయితే భారత్ సాధించిన రెండు విజయాలు కూడా చాలా ఉత్కంఠంగానే సాగాయి. మొదటి మ్యాచ్ లో మూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత్ కేవలం మూడు పరుగుల తేడాతోనే గెలిచింది. ఇక రెండో మ్యాచ్ లో విండీస్ మూడు వందలకంటే ఎక్కువ లక్ష్యం ఇవ్వగా కేవలం చివరి రెండు బంతులు మిగిలి ఉండగా రెండు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే భారత జట్టు విజయాలలో మొత్తం యువ ఆటగాళ్లు ముఖ్య పాత్ర అనేది పోషించారు. ఇలా యువ ఆటగాళ్లు ప్రదర్శన చేయడానికి ఐపీఎల్ కారణం అని టీం ఇండియా కెప్టెన్ ధావన్ పేర్కొన్నాడు.
నిన్న మ్యాచ్ తర్వాత ధావన్ మాట్లాడుతూ.. మా ఆటగాళ్లు చాలా మనోధైర్యంతో ఆడారు. మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయినా వారు ఎక్కడ వెనుకడుగు వేయలేదు. అయితే యువ ఆటగాళ్లు ఒత్తిడిలో ఇంత బాగా రాణించడానికి ఐపీఎల్ ప్రధాన కారణం. ఎందుకంటే అందులో ఎంతో మంది ఫ్యాన్స్ మధ్యలో వారు ఆడటం అనేది ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అది ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుంది. ఇక ఈ రెండో వన్డే గెలవడంలో సంజూ, శ్రేయాస్ అలాగే అక్షర్ ముఖ్య పాత్ర పోషించారు. వీరు ఒత్తిడిలో టెన్షన్ లేకుండా మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లారు అని ధావన్ పేర్కొన్నాడు.

Advertisement

Visitors Are Also Reading