సాధారణంగా టాటూలుగా పేరు లేదా జన్మినిచ్చిన తల్లిదండ్రుల పేర్లను వేయించుకుంటారు. మరికొందరూ తమకు ఇష్టమైన వారి పేర్లు, ప్రేమికుల పేర్లను పచ్చబొట్లుగా వేయించుకుంటారు. అయితే ఇటీవల నటుడు ఫర్హాన్ అక్తర్ తో ఏడు అడుగులు నడిచిన నటి శిబానీ దండేకర్ ఓ తేదీని టాటూగా వేయించుకుంది. ఇంతకు ఆ తేదీ స్పెషల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : మోహన్ బాబుకు షాక్…నాగశ్రీనుకు అండగా నాయిబ్రాహ్మణ సంఘం..!
Advertisement
నటుడు, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, ప్లే బ్యాక్ సింగర్ ప్రొడ్యూసర్, యాంకర్ ఇలా బాలీవుడ్లో మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఫర్హాన్ అక్తర్. భాగ్ మిల్కా భాగ్, తుఫాన్ చిత్రాలతో హీరోగానూ మంచి విజయాలు సొంతం చేసుకున్నాడు. నాలుగేళ్లుగా మోడల్, నటి శిబాని దండేకర్‌తో ప్రేమలో ఉన్న అతను ఇటీవల ఆమెతో కలిసి పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసినదే. ఫిబ్రవరి 21న ముంబయిలోని ఖండాలాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హృతిక్ రోషన్, రియాచక్రవర్తి, అనుషా దండకర్, ఫరాఖాన్ బాలీవుడ్ ప్రముఖులు ఫర్హాన్-శిబానిల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
తన పెళ్లి తేదీనే మోచేతిపై పచ్చబొట్టుగా వేయించుకుంది శిబానీ. రోమన్ నెంబర్లలో వెడ్డింగ్ డేట్ కనిపించేలా ఈ టాటూ వేయించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో వైరల్‌గా మారాయి. శిబానీ గతంలోనే ఫర్హాన్ పేరును తన మెడపై టాటూగా వేయించుకున్న సంగతి తెలిసిందే. ఫర్హాన్ అక్తర్‌కు గతంలోనే అధునా బబానీతో వివాహం అయింది. వీరిద్ధరికీ షక్యా, అఖీరా అనే ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. అనివార్య కారణాలతో 2017లో ఈ జంట విడాకులు తీసుకుంది. బ్రేకప్ అయ్యాక శిబానీ దండేకర్లో ప్రేమను వెతుక్కున్నాడు ఫర్హాన్. తాజగా ఆమెతో పెళ్లి పీటలు ఎక్కాడు. అన్నట్టు ఫర్హాన్ అక్తర్‌కు టాలీవుడ్ హీరోలతోనూ మంచి సాన్నిహిత్యముంది. మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలోని ఐడోంట్నో సాంగ్‌ను ఆలపించింది అతనే.
Also Read : నిరీక్షణ హీరోయిన్ అర్చన ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!