కొన్ని దృశ్యాలు చూడడానికి వింతగా, వినడానికి విచిత్రంగా కనిపిస్తుంటాయి. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది. వారందరూ ఎందుకు అలా చేసారు అని ఆ దృశ్యాలు చూసిన వాళ్లు మరో కొత్త ఆలోచనలో పడిపోతుంటారు. రాజస్థాన్‌లోని కొందరూ గొర్రెల కాపలదారులు చేసిన పని ఇలానే అనిపిస్తుంది. ఎండ నుంచి గొర్రెలను రక్షించడానికి గొర్రెల కాపరులు ఓ ప్రత్యేకమైన పద్దతిని కనుగొన్నారు.
Advertisement
చంబల్ నది వంతెనపై దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి గొర్రెలను ఒక్కొక్కటిగా నదిలోకి విసిరారు. గొర్రెల కాపరులు ఈ పనిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలియగానే షాకయ్యాడు. గొర్రెల కాపరులు చంబల్ నదిలో గొర్రెలను విసిరిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని కోట డివిజన్ లోని బుండి జిల్లాలోని లఖేరీ ప్రాంతానికి సంబంధించిన గొర్రెల కాపరులు మందను తీసుకొని బండిలోని లఖేరీ రొటేడ వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ అది చూసిన కొంత మంది గొర్రెల కాపరులను అడగ్గా.. వేడి ఎక్కువగా ఉందని చెప్పారు. ఎండ వేడిమికి గొర్రెలు అల్లాడుతున్నాయని.. ఇలాంటి పరిస్థితిలో వేడి నుంచి గొర్రెలను రక్షించేందుకు స్నానం చేసి చల్లార్చేందుకు వాటిని నదిలో పడేసారు.
Advertisement
ఈ ఘటన జరిగిన రోజు బుండిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు ఉంది. గొర్రెల శరీరంపై ఉన్ని కారణంగా అవి మరింత వేడిని అనుభవిస్తాయి. ఉన్ని కారణంగా అవి నీటిలో మునిగిపోవు. లోతైన నీటిలో కూడా ఈత కొట్టడం ద్వారా సులభంగా బయటపడొచ్చు. గొర్రెలను కాపాడేందుకు ఈ పద్దతిని పాటిస్తున్నారు. ఇక నదిలో పడిన గొర్రెలు కూడా తేలికగా బయటకు వచ్చాయి. రాజస్థాన్‌లో ఈ సారి రికార్డు స్థాయిలో హీట్ రావడం గమనార్హం. వాతావరణ శాఖ ప్రకారం.. మార్చి నుంచి ఇప్పటి వరకు వేడిగాలులు ఉన్నాయి. ఈసారి వేసవిలో హీట్ వేవ్ పరంగా రాజస్థాన్ హాట్ స్పాట్‌గా నిలుస్తోంది.
Also Read :
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్థిక ఉత్తర్వులను జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సుడిగాలి సుధీర్ వెళ్లిపోయాక శ్రీదేవి డ్రామా కంపెనీ తొలి ఎపిసోడ్ టాక్ ఎలా ఉందంటే..?