Home » నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఆర్థిక ఉత్త‌ర్వుల‌ను జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఆర్థిక ఉత్త‌ర్వుల‌ను జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

by Anji

ప్ర‌స్తుతంతో తెలంగాణ‌లో అంతా నోటిఫికేష‌న్ల జాత‌ర న‌డుస్తుంది. వ‌రుస ఉద్యోగాల నోటిఫికేష‌న్లు వెలువ‌డుతున్నాయి. మొన్న‌టివ‌రకు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూసిన నిరుద్యోగుల‌కు ఉద్యోగ నోటిఫికేష‌న్లు వ‌రంగా మారాయి. ఈ నోటిఫికేష‌న్ల విడుద‌ల‌తో లైబ్ర‌రీల‌కు క్యూ క‌డుతున్నారు. యువ‌తీ, యువ‌కులు కొంత‌మంది కోచింగ్‌సెంట్ల వ‌ద్ద‌కు వెళ్లి ప‌రుగులు తీస్తుండ‌గా.. మ‌రికొంద‌రూ లైబ్ర‌రీల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.


ఇక ఇలాంటి వారికి లైబ్ర‌రీల ప‌నివేళ‌లు.. ఇబ్బందిగా ప‌రిణ‌మించాయి. రోజులో కొద్ది గంట‌లు మాత్ర‌మే గ్రంథాల‌యాలు తెర‌చి ఉండ‌డంతో నిరుద్యోగులు నిరుత్సాహనికి గుర‌వుతున్నారు. ఈ ప‌రిస్థితిని అర్థం చేసుకున్న ప్ర‌భ‌త్వం గ్రంథాల‌యాల ప‌నివేళ‌ల‌ను మార్చ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇక తాజాగా గ్రంథాల‌యాల పాఠ‌కుల‌కు శుభ‌వార్తనే చెప్పారు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌. ఇక నుంచి ఉద‌యం 8 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌రకు గ్రంథాల‌యాలు ప‌ని చేస్తాయ‌ని స్ప‌ష్టం చేసారు. లైబ్ర‌రీల అభివృద్ధిపై స‌మీక్ష జ‌రిపించిన మంత్రి ఈ ఏర‌కు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసారు. పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవుతున్న అభ్య‌ర్థుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు త‌ల‌సాని చెప్పారు.

అవ‌స‌ర‌మైన గ్రంథాల‌యాల వ‌ద్ద అన్న‌పూర్ణ భోజ‌న కేంద్రాల ఏర్పాటు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇటీవ‌లే మ‌రొక నోటిఫికేష‌న్ వ‌చ్చింద‌ని.. తెలంగాణ ప్ర‌భుత్వం 1433 ఉద్యోగ నియ‌మాల‌కు ఆర్థిక శాఖ ప‌చ్చ‌జెండా ఊపింది. మున్సిపాలిటీ, పంచాయ‌తీరాజ్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట‌మెంట్ లో 1433 వివిధ క్యాడ‌ర్‌కు సంబంధించిన పోస్టుల భ‌ర్తీకి ఆర్థిక ఉత్త‌ర్వుల‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది.

Also Read : 

పోటీ పడి కోట్లలో పెళ్లి బహుమతులు ఇచ్చుకుంటున్న నయనతార విఘ్నేష్..!

 

Visitors Are Also Reading