Home » సానియా మీర్జాను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని షారుఖ్ అడిగిన ప్రశ్నకు షోయబ్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా?

సానియా మీర్జాను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని షారుఖ్ అడిగిన ప్రశ్నకు షోయబ్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మధ్య విడాకులు తీసుకున్నారనే వార్తలు వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు భారత్, పాక్ అభిమానులకు షాక్ కలిగించిన సంగతి తెలిసిందే. షోయబ్ తాను జావేద్ తో పెళ్లి చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పంచుకోవడంతో ఈ వార్తా వెలుగులోకి వచ్చింది. మాలిక్ మరియు సానియా మధ్య సంబంధాల సమస్యల గురించి గతంలో కూడా మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. సోషల్ మీడియాలో వారు పంచుకున్న మూమెంట్స్ కూడా చాలా తక్కువ. అసలు షోయబ్ సానియా ఇంస్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వలేదు.

Advertisement

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, నటుడు సనా జావేద్‌తో తన పెళ్లిని ప్రకటించిన తర్వాత, సానియా మీర్జా కుటుంబం సానియా, షోయబ్ లు విడిపోయారని.. సానియా ప్రైవసీకి భంగం కలిగించవద్దని పేర్కొంది. షోయబ్ మాలిక్ తన వివాహానికి సంబంధించిన చిత్రాలను సనా జావేద్‌తో పంచుకోవడంతో సానియా మరియు షోయబ్ వైవాహిక స్థితిపై సందేహాలు నిజమయ్యాయి మరియు సానియా కుటుంబం వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది.

Advertisement

షోయబ్ పెళ్లి వార్త ప్రచారంలోకి రావడంతో, పాకిస్తానీ క్రికెటర్ మరియు సానియా చర్చనీయాంశంగా మారింది. గతంలో వారిద్దరి తాలూకు వార్తలు ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో వారి ఇంటర్వ్యూ యొక్క ఒక ప్రత్యేక క్లిప్ ఇంటర్నెట్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. వీడియోలో, SRK సానియాను వారి వివాహానికి కారణం ఏంటి అడగగా.. సానియా షోయబ్ గురించి అతను ఓ జెన్యూన్, షై పర్సన్ అని చెప్పుకొచ్చింది. అతనిలో చాలా చూశానని.. అతనికి ఎలా మాట్లాడాలి అనేది కూడా నేర్పించాలని అన్నారు. ఇక ఇదే ప్రశ్నను షోయబ్ ను అడగగా.. నేను దాని గురించి ఆలోచించే సమయం రాక ముందే పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading