Home » పాకిస్థాన్ లో మెగాస్టార్ క్రికెట్ లీగ్..!

పాకిస్థాన్ లో మెగాస్టార్ క్రికెట్ లీగ్..!

by Azhar
Ad

మన దేశంలో ప్రాస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తునట్లే… క్రికెట్ ఆడే ప్రతి దేశంలో తమ సొంత లీగ్ లు నడుస్తుంటాయి. అలాగే అన్ని రకాల క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాజీ ఆటగాళ్లు కూడా కొన్ని టోర్నీలలో ఆడుతుంటారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ అనే టోర్నీలో భారత మాజీ ఆటగాళ్లు సచిన్, సెహ్వాగ్ తో పాటుగా విదేశీ లెజెండ్స్ కూడా పాల్గొంటుంటారు. ఇప్పుడు అలంటి లీగ్ ఒక్కటి పాకిస్థాన్ లో కూడా ప్రారంభం కాబోతుంది.

Advertisement

Advertisement

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022 లో పాల్గొన తర్వాత.. అదే తన చివరి లీగ్ అని ప్రకటించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్.. అత్యుత్తమ ఆల్ రౌండర్ అయిన షాహిద్ అఫ్రిది తాజాగా ఓ క్రికెట్ లీగ్ ను ప్రారభించబోతున్నట్లు ప్రకటించాడు. మెగాస్టార్ లీగ్ అని దీనికి పేరు పెట్టిన అఫ్రిది.. ఇందులో పాక్ మాజీ ఆటగాళ్లతో పాటుగా విదేశీ మాజీలు కూడా పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ మెగాస్టార్ లీగ్ ను ప్రారంభిస్తాం. ఇందులో విదేశీ మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. మొత్తం 6 జట్లు ఇందులో పోటీ పడుతాయి. టీ10 ఫార్మటు లో ఇందులో మ్యాచ్ లు సాగుతాయి. మాజీ ఆటగాళ్లకు ఆర్ధికంగా సహాయం చేయాలనే ఈ లీగ్ ను నిర్వహిస్తున్నం అని అఫ్రిది పేర్కొన్నారు.

Visitors Are Also Reading