భారత మహిళల జట్టులోకి సడెన్ ఎంట్రీ అనేది ఇచ్చింది షెఫాలీ వర్మ. ఓపెనర్ గా స్వతహాగా ఈమె ఆడే దూకుడు ఆటతో లేడి సెహ్వాగ్ గా పేరొందింది. అలాగే మూడు ఫార్మాట్లలో జట్టులో కూడా తన స్థానానికి స్థిరం చేసుకుంది. అయితే ఇప్పుడు మన మహిళల జట్టు కామన్వెల్త్ గేమ్స్ 2022 లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ గేమ్స్ లో మన మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా ఆడం. అయితే ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన ఘటన అనేది చోటుచేసుకుంది. భారత ఓపెనర్ షెఫాలీ వర్మ క్రీజు దాటినా నాట్ ఔట్ ఇచ్చారు అంపైర్.
Advertisement
మీరు పైన చూస్తున్న ఫోటోలో మన బ్యాటర్ షెఫాలీ వర్మ క్లియర్ గా క్రీజు బయట ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హేలీ స్టంప్స్ ను కొట్టింది. అయిన కూడా ఇది నాట్ ఔట్ అని ఇచ్చారు. ఎందుకంటే.. షెఫాలీ తాలిమా మెగ్రాత్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ముందుకురాగా.. బాల్ మిస్ అయ్యి కీపర్ హేలీ చేతిలో పడింది. అప్పుడే హేలీ స్టంప్స్ ను ఎగరగోటింది. కానీ ఆ సమయంలో బాల్ అనేది హేలీ యొక్క ఎడమ చేతిలో ఉంది. కానీ ఆమె స్టంప్స్ ను మాత్రం కుడి చేతితో కొట్టింది.
Advertisement
క్రికెట్ లో ఉన్న నియమాల ప్రకారం కీపర్ ఏ చేతిలో బాల్ ఉంటుందో ఆ చేతితో లేదా ఆ చేతి మణికట్టుతో స్టంప్స్ ను కొడితే అది ఔట్ అవుతుంది. కానీ చేతిలో బాల్ లేకున్నా.. లేక ఒక్క చేతిలో బాల్ ఉంచుకొని మరో చేతితో అంటే హేలీ చేసిన విధంగా చేసిన అది నాట్ ఔట్ గా ఇస్తారు. అయితే ఇక్కడ హేలీ చేసిన తప్పవు అనేది షెఫాలీకి బాగా కలిసి వచ్చింది. అయితే అంపైర్ నాట్ ఔట్ గా ఇవ్వడంతో షెఫాలీతో సహా అందరూ ఆశ్చర్యపోయినా… తర్వాత విషయం తెలుసుకొని భారత ప్లేయర్స్ నవ్వుకుంటే.. ఆసీస్ ప్లేయర్స్ దానిని నమ్మలేకపోయారు.
ఇవి కూడా చదవండి :