ప్రస్తుత కాలంలో తమ తల్లిదండ్రులను ఇంట్లో నుండి వెల్లగొడుతూ మానవత్వాన్ని మర్చిపోతున్న ఘటనల గురించి మనం చాలా వింటుంటాం. ఇంకాస్త ముందుకెళ్ళి కనీసం ఒక ఇంచు స్థలాన్ని కూడా ఎవరికి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ఇంకా ఇతర మతస్థులకు ఇవ్వడానికి అసలే ఇష్టపడరు. అయితే సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యాపార వేత్త చేసిన పని నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు వ్యాపారవేత్తను ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఇక అసలు విషయానోకిస్తే టూరిజం ఆర్గనైజర్ గా గురుగ్రామ్ లో పలు షాపులను కలిగి ఉన్న ఓ హిందూ వ్యాపారవేత్త అక్కడ కొంత మంది ముస్లింలకు ప్రతి శుక్రవారం రోజూ నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతున్న క్రమంలో ఏకంగా నమాజ్ చేసుకోవడం కొరకు తన స్థలాన్ని ఇచ్చారు.
Advertisement
Advertisement
రాజకీయాల గురించి కులాలు, మతాల విధ్వంసాలు సృష్టిస్తారు. కానీ మంచితనం ముందు ఏ మతం పనికి రాదు అనేదానికి ఈ ఒక్క ఘటనే నిదర్శనం. అసలు సిసలైన సెక్యులరిజం ఇదే కదా. అయితే ముస్లింలు అందరూ కలసి స్థానిక మున్సిపల్ అధికారులను శుక్రవారం నమాజ్ కొరకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రైవేట్ ల్యాండ్ లలో మత ప్రార్థనలు చెయ్యరాదు అని ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఈ వ్యాపారవేత్త తీసుకున్న ఈ నిర్ణయానికి స్థానిక ముస్లింలు అందరూ కృతజ్ఞతలు తెలిపారు.
ఒక అన్నదమ్ములం అనే భావనతో నమాజ్ కు అనుమతించడం చాలా గొప్ప విషయమని నెటిజన్లు వ్యాపార వేత్తను అభినందిస్తున్నారు. ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారని ఇటువంటి విషయాలను మరింత మందికి తెలిసేలా చేసినప్పుడే కుల, మత ఘర్షణలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సదరు వ్యాపార వేత్త తీసుకున్న నిర్ణయానికి అతనిని శభాష్ అనాల్సిందే.