సమంత నటించిన శాకుంతలం సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ అభిజ్ఞానశాకుంతం అనే పౌరాణికనాటకం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించాడు. అంతే కాకుండా అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాను గుణశేఖర్ భారీ అంచనాల నడుమ తెరెక్కించారు. అయితే సినిమా మాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది. గుణశేఖర్ ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని అనుకున్నారని కానీ ఆ ఫార్ములా కూడా జనాలను మెప్పించలేదు.
read also : Vishnu priya : దేవుడా.. ముద్దుల కోసం బరితెగించిన విష్ణు ప్రియ !
Advertisement
# దుష్యంతుడు, శకుంతల మధ్య చిగురించిన అందమైన ప్రేమకథ చివరికి ఎలాంటి పరిస్థితులకు దారితీసింది అన్నది మెయిన్ పాయింట్ గా శాకుంతలం ని ఆవిష్కరించారు దర్శకుడు గుణశేఖర్.
# ఇలాంటి కథకి సమంతని ఎంపిక చేసుకోవడం గుణశేఖర్ చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమెలో క్యూట్ నెస్ ఉంటుంది. కానీ ఇంత బరువైన పాత్రను మోయగల స్టామినా ఆమెకు లేదు.
Advertisement
# ఈ సినిమాని 3Dలో చూడాలి అని టీం చెప్పడం కూడా ఓ పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు.
# వి.ఎఫ్.ఎక్స్ కోసం ఇంకాస్త టైం తీసుకున్నట్లు గుణశేఖర్ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అత్యంత నాసిరకంగా ఉన్నాయి.
# యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మరి పేలవంగా ఉన్నాయి. యుద్ధం జరుగుతున్నప్పటికీ ప్రేక్షకులకు ఏదో టీవీ యాడ్ చూస్తున్న ఫీలింగ్ ను కలిగించారు.
# శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ కన్నుల విందు చేయలేకపోయింది. భారీతనాన్ని ఎక్కడా కూడా చూపించలేకపోయింది అని చెప్పాలి.
# సినిమాలో దుష్యంత మహారాజుగా చేసిన దేవ్ మోహన్ దుర్వాస మహర్షిగా చేసిన మోహన్ బాబు తప్ప మిగిలిన పాత్రలు ఏమాత్రం గుర్తుండవు.
# శాకుంతలం సినిమాలో అల్లు అర్హ నటిస్తుంది అని చెప్పకుండా సర్ప్రైజ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ చిత్రంలో ఆ పాప భరతుడి పాత్ర అంటే బాలుడు పాత్ర వేసినట్టు. కానీ అర్హ కాబట్టి భరతుడు అనే బాలుడిని చూస్తున్నట్టు అనిపించలేదు.
# మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు జనాలకు ఎక్కలేదు. మల్లికా మల్లికా పాట కాస్తో కూస్తో ఓకే అనిపిస్తుంది అంతే.
READ ALSO : మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!