Home » చదువులో కూడా ముందున్న 7 స్టార్ క్రికెటర్లు…

చదువులో కూడా ముందున్న 7 స్టార్ క్రికెటర్లు…

by Azhar
Ad

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ తర్వాత ఎక్కువ పాపులారిటీ ఉన్న స్పోర్ట్స్ క్రికెట్. గత కొన్నేళ్లుగా క్రికెట్ ఆటగాళ్లు కూడా చాలా పాపులారిటీని సంపాదించారు. ఇప్పుడు ఉన్న పిల్లల్లో కూడా చాలా మంది క్రికెటర్లు కావాలని అనుకుంటున్నారు. కానీ అందులో ఎక్కువ మంది చదువును పక్కన పెడుతున్నారు. అయితే క్రికెటర్లందరూ బాగా చదువుకున్న వారు కాదు. కానీ క్రికెట్ తో పాటుగా చదువులో కూడా టాప్ ప్లేస్ లో నిలిచిన ఏడుగురు క్రికెటర్ల గురించి ఇప్పుడు చూద్దాం.

Read More : హర్షల్ ఇంట్లో తీవ్ర విషాదం.. బబుల్ నుండి బయటకు..!

Advertisement

రాహుల్ ద్రవిడ్

రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. అతని డిఫెన్సివ్ టెక్నిక్ వల్ల అభిమానులు అందరూ అతడిని ‘ది వాల్’ అని పిలుస్తారు. ద్రవిడ్ ఇప్పుడు భారత జట్టు హెడ్ కోచ్ గా ఉన్నాడు. అయితే అతనికి భారత్ తరఫున ఆడే అవకాశం రాకముందు ఎంబీఏ డిగ్రీ చదువుతున్నాడు. ఆ తర్వాత క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు.

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌లో మంచి విజయాలు సాధించిన భారత ఆల్ రౌండర్. అశ్విన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నాడు. నిజానికి అశ్విన్ ఓ ఐటీ కంపెనీలో పనిచేశారు. కానీ ఆ తర్వాత అశ్విన్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. ఇప్పుడు, అతను ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడు.

స్మృతి మందాన

అత్యంత విజయవంతమైన మహిళా క్రికెటర్లలో స్మృతి మందాన ఒకరు. ఆమె భారత మహిళల క్రికెట్ జట్టులో ముఖ్యమైన బ్యాటర్ . ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన స్మృతి తన తగ ఇంటర్వ్యూలో సైన్స్ చదవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. కానీ సైన్స్ చదవాలంటే మొత్తం దృష్టి దానిపైనే పెట్టాలి. కాకపోతే తను క్రికెట్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆమె తల్లిదండ్రులు కామర్స్ తీసుకోవాలని సూచించారు.

Advertisement

అక్షర్ పటేల్

అక్షర్ పటేల్ భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన ఆల్ రౌండర్ గా ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌ తో భారత జట్టు స్వదేశంలో తలపడిన టెస్ట్ సిరీస్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. అక్షర్ చాలా తెలివైన విద్యార్థి. కానీ ఈ విషయం ఎవ్వరికి తెలియదు. కాకపోతే అతని తల్లిదండ్రులు క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేలా అతడిని ప్రోత్సహించారు.

కేన్ విలియమ్సన్

కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టు కెప్టెన్. అతని కెప్టెన్సీలో కివీస్ 2019 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే 2021లో, విలియమ్సన్ నాయకత్వంలో బ్లాక్‌క్యాప్స్ ఇండియాను ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న అతను అద్భుతమైన విద్యార్థి కూడా. నిజానికి… విలియమ్సన్ తన పాఠశాల రోజుల్లో హెడ్ బాయ్ గా ఉండేవాడు.

కుమార సంగక్కర

కుమార సంగక్కర శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. అతని నాయకత్వంలో శ్రీలంక 2011 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకొని… భారత్ చేతిలో ఓడింది. అతను క్రికెట్ ఆడిన రోజుల్లో అప్పటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. అయితే సంగక్కర ఒక అద్భుతమైన విద్యార్థి. అతను కొలంబో విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఆఫ్ లా డిగ్రీని పొందాడు.

సర్ఫరాజ్ అహ్మద్

 

సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్. 2017లో ఇండియాను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌ అతను. అహ్మద్ సాధారణంగా తన జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతాడు. అలాగే అతను ఇంగ్లిష్ తో అభిమానుల చేతిలో ట్రోల్ కు గురవుతాడు. కానీ సర్ఫరాజ్‌ కు ఇంజనీరింగ్ డిగ్రీ ఉందని చాలా మంది అభిమానులకు తెలియదు.

Visitors Are Also Reading