Home » గర్భిణీలు నువ్వులని తీసుకోవచ్చా…? నువ్వులను తీసుకుంటే ఏం అవుతుంది..?

గర్భిణీలు నువ్వులని తీసుకోవచ్చా…? నువ్వులను తీసుకుంటే ఏం అవుతుంది..?

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం కచ్చితంగా మనం పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. గర్భిణీలు కూడా వారి యొక్క ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి గర్భిణీలు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. గర్భిణీలు తల్లి, బిడ్డ ఆరోగ్యం గా ఉండేటట్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే గర్భిణీలు నువ్వులు తినచ్చా..? తినకూడద…? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి గర్భిణీలు నువ్వులు తినకూడదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ టైంలో బొప్పాయి, పైనాపిల్, నువ్వులు తీసుకోవద్దని పెద్దలు అంటూ ఉంటారు. నువ్వులను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుందని నువ్వులతో కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతుందని అంటుంటారు.

Advertisement

Advertisement

గర్భిణీలు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదట. నువ్వులను లిమిట్ గా తినడమే మంచిది. గర్భిణీలు ఎక్కువగా తీసుకుంటే గర్భాశయాన్ని ఉత్తేజితం చేస్తాయి. గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు నువ్వులకి దూరంగా ఉండటం మంచిది. నువ్వులు నలుపు, తెలుపు రంగులో మనకి ఉంటాయి. గర్భిణీలు తెల్ల నువ్వులు తింటే సురక్షితం కాదు అని అంటారు. నిజానికి నువ్వులు తీసుకోవడం వలన పెద్దగా సమస్యలు రావు కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.

లిమిట్ గానే తీసుకోవాలి. నువ్వుల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఐరన్ ప్రోటీన్ తో పాటుగా ఫైబర్, క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు, క్యాల్షియం కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో నువ్వులన్నీ తినొచ్చు కానీ వీటికి దూరంగా ఉండటమే మంచిది పీరియడ్స్ త్వరగా రావడానికి నువ్వులు తినడం మంచిది. నెలసరి వేగవంతం అవ్వడానికి నువ్వులు బాగా హెల్ప్ అవుతాయి. గర్భిణీ స్త్రీలు వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి సో ఇలా మీరు నవ్వుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నువ్వుల్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రెగ్నెన్సీ వారిలో సమస్యలు వస్తాయి.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading