Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » సీరియల్‌ నటి లహరి అరెస్ట్ !

సీరియల్‌ నటి లహరి అరెస్ట్ !

by Bunty
Ads

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం… రోడ్లు రక్తమోడుతున్నాయి. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకొని శంషాబాద్ వైపు బైకు పై వస్తుండగా వెనకాలనుంచి మారుతి సుజుకి కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి కిందపడి గాయపడ్డాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని కారును చుట్టుముట్టారు.

Advertisement

Ad

Advertisement

కర్నూల్ డ్రైవ్ చేస్తున్న మహిళలు కిందకి దిగాలి అంటూ హడావిడి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కారులో ఉన్న మహిళను కిందికి దిగాలని ఆదేశించగా ఆమె బయటకు వచ్చింది. కారు డ్రైవింగ్ చేసిన మహిళలు సీరియల్ నటి లహరి గా గుర్తించడంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. అయితే ఆమె మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి ఉంటుందని అనుమానించిన పోలీసులు లహరి స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా మద్యం సేవించిందని తేలింది. గాయ పడిన వ్యక్తి కూడా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు లహరిని వదిలిపెట్టాలి.

Visitors Are Also Reading