చైనాలో మరోసారి ప్రపంచ దేశాలను భయపెడుతోంది కరోనా వైరస్. కరోనా వైరస్ కు జన్మనిచ్చిన దేశంలోనే మరోసారి వైరస్ వర్రీ అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. డ్రాగన్ కంట్రీలో కొత్తగా కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవడంతో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇటు ఇండియా లోను కొత్త వేరియంట్ ప్రవేశించింది.
Advertisement
ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఓ వివాదానికి తెరలేపారు. ఏసుక్రీస్తు దయవల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో డిహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ మనుగడకు క్రైస్తవ మతమే అభివృద్ధిని నేర్పిందన్నారు శ్రీనివాసరావు. ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమని వ్యాఖ్యానించారు.
Advertisement
రెండున్నర ఏళ్ల నుంచి కోవిడ్ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిందన్నారు. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయటపడలేదు. ఏసుక్రీస్తు కృప, దయవల్లే కరోనా తగ్గిందని డిహెచ్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చ నియాంశంగా మారాయి. అయితే, జీసస్ వల్లే కరోనా తగ్గింది అంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీనివాసరావు వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిహెచ్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది. శ్రీనివాసరావును డిహెచ్ పదవి నుంచి తక్షణం తొలగించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే తన వ్యాఖ్యాలను మీడియా వక్రీకరించిందంటూ డిహెచ్ వివరణ ఇచ్చారు.
READ ALSO : Sachin To Kohli : 2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు