టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోయిన్ ఛార్మి రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ చాలా కాలం నుండి ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా పూరి జగన్నాథ్ చార్మి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చార్మి పూరి జగన్నాథ్ కాంబినేషన్లో జ్యోతిలక్ష్మి సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఛార్మి హీరోయిన్ గా నటించగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఛార్మి కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా తర్వాతనే ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఇక రీసెంట్ గా పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన చోర్ బజార్ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ ఈవెంట్ లో బండ్లగణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ భార్యను సీతాదేవితో పోలుస్తూ ఈవెంట్ కు రానందుకు పూరి పై ఫైర్ అయ్యారు. సక్సెస్ వచ్చిన తర్వాత చాలామంది వచ్చారని కానీ మా వదినమ్మ పూరి దగ్గర రెండు వందల రూపాయలు ఉన్నప్పటినుండి ఉందని అన్నారు.
Advertisement
అదేవిధంగా ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అయితే బండ్ల గణేష్ ఈ కామెంట్లు ఛార్మిని ఉద్దేశించే చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు సినిమాలు చేసిన దర్శకుడు గీతాకృష్ణ సైతం తాజాగా పూరి చార్మి ల రిలేషన్ షిప్ పై స్పందించారు. చార్మి పూరి జగన్నాథ్ సెటప్ అంటూ సంచలన కామెంట్ చేశాడు.
అదేం తప్పు కాదని పూరి జగన్నాథ్ తన భార్యకు రెండు రోజులు ఛార్మికి రెండు రోజులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. చాలామంది భార్యలకు విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారని కానీ పూరి జగన్నాథ్ అలా చెయ్యలేదని అన్నాడు. అటు భార్య బంధానికి విలువ ఇస్తూనే ఛార్మిని సెటప్ గా పెట్టుక్కున్నాడు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. దాంతో ప్రస్తుతం గీత కృష్ణ చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.