Home » ఒంటరిగా.. బెడ్ రూమ్ కు రమ్మన్నాడు – ఆమని సంచలన వ్యాఖ్యలు..

ఒంటరిగా.. బెడ్ రూమ్ కు రమ్మన్నాడు – ఆమని సంచలన వ్యాఖ్యలు..

by Bunty
Ad

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా, తక్కువే అవుతుంది. హీరోయిన్ గా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. కానీ ప్రతి అమ్మాయికి ముందుగా ఎదురయ్యేది కాస్టింగ్ కౌచ్. ఇప్పుడు కాదు, గత కొన్నేళ్లుగా ఈ సమస్యను ఫేస్ చేసిన వాళ్లే ఉన్నారు. ఇప్పటికే కొందరు ఈ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులను బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై నటి ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఆమె కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ‘ఇండస్ట్రీలోకి రావడానికి నేను కూడా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్ కోసం కంపెనీలకు వెళ్లే దాన్ని. కొన్ని కంపెనీల్లో సెలెక్ట్ అయ్యేదాన్ని. కొన్నింటిలో రిజెక్ట్ చేసేవాళ్లు. అయితే కొందరు చెప్పి పంపిస్తాం అనే వాళ్ళు. అంటే ఏంటో మొదట నాకు కూడా అర్థం కాలేదు. మేడం, డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పే వాళ్ళు. ఎందుకు? అని అడిగితే మేకప్ టెస్ట్ చేయాలంట అని చెప్పేవారు.

Advertisement

సరే అమ్మతో కలిసి వస్తా అన్నాను. ఆయన మాత్రం అమ్మగారు వద్దు, మీరు ఒంటరిగా రావాలి అన్నాడు. వెంటనే అమ్మ తను ఒంటరిగా రాదు, ఇద్దరం కలిసి వస్తామని చెప్పింది. దీంతో ఆయన వద్దులేండి, డైరెక్టర్ గారు వద్దంటున్నారు అని ఫోన్ కట్ చేసేవాళ్లు. నాకు పోనుపోను అర్థమైంది. అమ్మ లేకుండా నన్ను ఒక్కదాన్నే ఎందుకు రమ్మంటున్నారు తర్వాత తెలిసి వచ్చింది. ఇలా చాలా జరిగాయి. కానీ ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు’ అని క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమని.

read also : అతడు సినిమాలో ఆ సీన్ ను.. త్రివిక్రమ్ కాపీ కొట్టారని మీకు తెలుసా?

Visitors Are Also Reading