వన్డే ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కూడా చేసింది బీసీసీఐ. ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం… అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు అంటే దాదాపు 40 రోజుల పాటు ఈ మెగా టోర్నీ జరగనుంది అన్నమాట.
Advertisement
ఇక ఈ మెగా టోర్నీలో ఏకంగా 10 దేశాలు పాల్గొననున్నాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండియాలో వన్డే ప్రపంచ కప్ జరుగుతోంది. ఇక మొదటగా జట్ల ర్యాంకింగ్ ప్రకారం 7 జట్లు ప్రపంచకప్ టోర్నమెంటుకు క్వాలిఫై కాగా… క్వాలిఫైయర్ మ్యాచ్లలో భాగంగా శ్రీలంక మరియు నెదర్లాండ్ జట్లు కూడా వరల్డ్ కప్ టోర్నమెంట్ కు క్వాలిఫై అయ్యాయి. అయితే దురదృష్టవశాత్తు మూడో స్థానంలో నిలిచి స్కాట్లాండ్ జట్టు వరల్డ్ కప్ కు క్వాలిఫై కాలేకపోయింది. ప్రస్తుతం ఉన్న పది జట్లఎల్లో ఏదైనా జట్టు టోర్నీ నుంచి వైదొలిగితే స్కాట్లాండ్కు ఛాన్స్ ఉంటుంది.
Advertisement
అయితే ఇండియాలో ఆడేందుకు పాకిస్తాన్ మొదటి నుంచి ఆసక్తి చూపడం లేదు. భద్రతా కారణాలు చూపి… ఇండియాకు వచ్చేందుకు మొహమాటపడుతోంది పాకిస్తాన్. ఒకవేళ పాకిస్తాన్ టీం ను ఆ దేశ ప్రభుత్వం ఇండియాకు పంపించకపోతే… స్కాట్లాండ్ వన్డే వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టును మరి ఇండియాకు పంపిస్తుందో లేదో త్వరలోనే క్లారిటీ రానుంది. ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఇంతలోగా పాకిస్తాన్ సర్కార్ ఏ నిర్ణయం అయిన తీసుకోవచ్చును.
ఇవి కూడా చదవండి
MS DHONI : కేవలం రూ. 30 లక్షల కోసమే క్రికెట్ లోకి వచ్చిన ధోని !
Tamim Iqbal : ప్రధాని వార్నింగ్.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్ !
Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు